ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 3PM - తెలంగాణ టాప్​ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top news టాప్ న్యూస్ 3PM
Telangana Top news టాప్ న్యూస్ 3PM
author img

By

Published : Aug 20, 2022, 3:00 PM IST

  • హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్..

ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో నిర్వహిస్తున్న ప్రజాదీవెన సభకు వెళ్తున్నారు. 400 కార్లు ర్యాలీగా బయలుదేరగా సీఎం కాన్వాయ్ హబ్సీగూడ నుంచి మునుగోడు వెళ్తోంది. తెరాస శ్రేణుల కోలాహలంతో నగర రహదారులన్నీ సందడిగా మారాయి. మరోవైపు సీఎం కాన్వాయ్ రాకతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

  • ఆ బాధ్యత న్యాయవాదులదే..

ప్రజలందరికి సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడలో కోర్టు భవనాలు ప్రారంభించారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్న ఆయన న్యాయవ్యవస్థలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ రాష్ట్ర హైకోర్టు సీజే, ఏపీ సీఎం జగన్​లతో కలిసి భవనాలను సీజేఐ ప్రారంభించారు.

  • ఆ దేశ ప్రధానికి డ్రగ్స్​ పరీక్ష..

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బహిర్గతం కావడం ఆ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలో ప్రధాని డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పించగా తాజాగా ఆమె డ్రగ్స్‌ పరీక్ష చేయించుకున్నారు.

  • హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్..

kishan reddy on munugode by poll రాష్ట్రంలో ప్రజలు తెరాసను నమ్మే పరిస్థితి లేదని, మునుగోడు ఉప ఎన్నికలో భాజపా విజయం ఖాయమని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితమే మునుగోడులోనూ రిపీట్ అవుతుందన్నారు. మరోవైపు ఆత్మ గౌరవానికి, అహంకారానికి యుద్ధం ఈ ఉప ఎన్నిక అని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజలంతా మునుగోడు వైపే చూస్తున్నారన్నారు.

  • మునావర్​కు కరోనా లక్షణాలు..

Shilpa kala Vedika Bandobastu శిల్పకళావేదికలో బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. మునావర్ ఫారూఖీ కామెడీ షో అడ్డుకుంటామని భాజపా హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు తనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో మునావర్ వెల్లడించారు.

  • మరోసారి కేసీఆర్​ కుట్ర..

bandi sanjay comments on cm kcr రాష్ట్రంలో మరోసారి విద్యుత్​ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. అందుకే కేంద్రం ఎక్స్ఛేంజీలో విద్యుత్​ విక్రయాలు ఆపేసిందని పేర్కొన్నారు. జనగామ జిల్లా ఖిలాషపూర్​లో ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

  • ఇది పోలీసుల వైఫల్యమే..

Constable murder case ఆయన ఓ పోలీసు కానిస్టేబుల్‌. రౌడీషీటర్ల చేతిలో హత్యకు గురై పదిరోజుల దాటింది. కానీ ఇప్పటికీ నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేశాం. నిందితుల కోసం గాలిస్తున్నాం. అనే ప్రకటనలే తప్ప వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు. ఇదంతా పోలీసుల వైఫల్యమేనని స్థానికులంటున్నారు.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర..

Gold Rate Today బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే.

  • సింధుకు ఆ వ్యక్తి బెదిరింపు లేఖ..

ఇప్పటి వరకు తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

  • చొక్కాలేకుండా స్విమ్మింగ్​పూల్​లో మహేశ్​..

ఇటీవలే సర్కారు వారి పాటతో సూపర్​ సక్సెస్​ను అందుకున్న సూపర్​స్టార్​ మహేశ్‌ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్​తో చేయబోయే సినిమా కోసం మేకోవర్​ చేంజ్​ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గడ్డంతో ఉన్న తన కొత్త లుక్స్​ను పోస్ట్​ చేస్తూ అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే తాజాగా స్విమ్మింగ్‌ పూల్​లో చొక్కా లేకుండా కనిపించి ఫ్యాన్స్​కు షాక్​ ఇచ్చారు మహేశ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.