ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 19, 2022, 2:59 PM IST

  • హైదరాబాద్​లో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లో అంబర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. కళాశాలలోని ప్రిన్సిపల్ గదిలోనే సాయినారాయణ అనే విద్యార్థి తన ఒంటి మీద పెట్రోల్‌ పోసుకునేందుకు ప్రయత్నించాడు. టీసీ కోసం మాట్లాడుతూనే ప్రిన్సిపల్‌ ఎదురుగా విద్యార్థి నిప్పంటించుకున్నాడు.

  • నిధులు ఇవ్వని సీఎం, మునుగోడు ఎలా వస్తారని ప్రశ్నించిన రాజగోపాల్‌ రెడ్డి

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వని సీఎం కేసీఆర్.. మునుగోడు ఎలా వస్తారని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేశారో... మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

  • నిజాయతీగా ఎలా బతకాలో గాంధీ నేర్పారన్న సీజేఐ

ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉద్యమాలు, పోరాటాలు హింసాత్మకంగానే జరిగాయని కానీ స్వాతంత్య్రం కోసం భారతదేశం చేసిన పోరాటం మాత్రం అహింసా మార్గంలో జరిగిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆ అహింసా మార్గంలో దేశానికి స్వేచ్ఛావాయువులను తెచ్చింది గాంధీ మహాత్ముడని, సత్యశోధన పుస్తకం ద్వారా గాంధీని మరోసారి గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు.

  • కత్తి విన్యాసాలతో గిన్నిస్​ రికార్డ్​, ఒకే చోట వేలాది మంది కలిసి

ఐదు వేల మంది రాజ్‌పుత్ యువకులు కత్తులతో విన్యాసాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ అరుదైన సంఘటన గుజరాత్​లోని జామ్ నగర్​లో శుక్రవారం జరిగింది. చరిత్రాత్మక 'భుచార్ మోరీ మైదాన్' యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం.. అఖిల గుజరాత్ రాజ్‌పుత్ యువ సంఘ్​తోపాటు షహీద్ స్మారక ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

  • బాయ్​ఫ్రెండ్​తో గొడవ, మద్యం సేవించి చేయి కోసుకున్న యువతి

బాయ్​ఫ్రెండ్​తో గొడవ పెట్టుకుని ఓ యువతి రోడ్డుపై వీరంగం సృష్టించింది. అనంతరం ​చేయి కోసుకుంది. గాయపడిన అమ్మాయిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని నైనీతాల్​లో జరిగింది.

  • ప్రియుడితో భార్య పరార్​, ముగ్గురు పిల్లలకు విషం తాగించి

భార్య ఇంటికి తిరిగి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనతో పాటు ముగ్గురు పిల్లలకు కూడా విషం తాగించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • కుంబ్లేకు పంజాబ్​ షాక్​, కొత్త కోచ్​ కోసం ప్రయత్నాలు

టీమ్​ఇండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ షాకివ్వనున్నట్లు సమాచారం. కోచ్​గా అతడి స్థానంలో మరో క్రికెటర్​కు ఆ బాధ్యతలను అప్పగించనుందని తెలుస్తోంది.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ లక్ష కోట్లకు పసిడి దిగుమతులు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా తగ్గింది. మరోవైపు, దేశంలో ఏప్రిల్‌-జులై మధ్య పసిడి దిగుమతులు భారీగా పెరిగి దాదాపు రూ.1.02 లక్షల కోట్లకు చేరాయి.

  • యాపిల్‌ యూజర్లకు బిగ్​ అలర్ట్, వెంటనే అప్డేట్​ చేసుకోండి లేకుంటే

తమ ఉత్పత్తుల్లోని సాఫ్ట్​వేర్​లో తీవ్రమైన భద్రతా లోపాన్ని గుర్తించినట్లు టెక్ దిగ్గజం యాపిల్​ తెలిపింది. ఐఫోన్​, ఐపాడ్ యూజర్లు తమ సాఫ్ట్​వేర్లను వెంటనే అప్డేట్​ చేసుకోవాలని సూచించింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని లోపాన్ని ఆసరాగా చేసుకొని హ్యాకర్లు అనైతిక చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

  • తీవ్ర కరవు, ప్రజల నానా పాట్లు, వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్​

తీవ్ర కరవుతో చైనా ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద నది అయిన యాంగ్జీలో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. దాంతో పాటు దేశంలో విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఫ్యాక్టరీలకు సైతం పూర్తిగా సెలవులిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.