ETV Bharat / city

Telangana Top News: టాప్ న్యూస్ @ 5PM - 5PM టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Jul 4, 2022, 4:59 PM IST

  • పోలీస్ అభ్యర్థులకు అలర్ట్...

రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలు విడుదల అయ్యాయి. రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్‌ఐ, 21న కానిస్టేబుల్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

  • 'తెలంగాణకు కేసీఆరే అతిపెద్ద ఇంజిన్'

తెలంగాణ మంత్రులు భాజపా నేతల తీరుపై ధ్వజమెత్తారు. వారి మాటల్లో విషం తప్ప.. విషయం లేదని ఆరోపించారు. విజయ సంకల్ప సభలో.. అన్ని అబద్ధాలే చెప్పారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ఏ ఇంజిన్లు అవసరం లేదని... కేసీఆరే అతిపెద్ద ఇంజిన్‌ అని పేర్కొన్నారు.

  • మంకీ క్యాప్స్.. గ్యాస్ కట్టర్స్.. జులాయి సీన్ రిపీట్..!

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో భారీ చోరీ జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నగదు, బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాంక్ లాకర్లలోని రూ.7.22 లక్షలు, రూ.2 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు.

  • 'నేను ఏది మాట్లాడినా పార్టీ కోసమే.. ఆ విషయంలో అనుమానం వద్దు'

రాజకీయంలో అనేక ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే తెరాస, భాజపాలు పోటాపోటీగా సభలు నిర్వహించి ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. నేను కాంగ్రెస్​ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

  • విజయ సంకల్ప సభ అందరి సహకారంతో విజయవంతమైంది..

సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిన్న జరిగిన విజయ సంకల్ప సభ అందరి సహకారంతో విజయవంతమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రజలకు బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి అందాలు... చూసొద్దామా..!

ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. జిల్లాలోని జలపాతాలు నీటితో కలకలలాడుతున్నాయి. ఎత్తైన గుట్టల నుంచి జాలువారే నీటిధారాలు చూపు తిప్పుకోనివ్వడం లేదు.

  • బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలికి ఎక్స్​రే.. రిపోర్ట్స్​ చూస్తే...

13 ఏళ్ల బాలుడు నది దాటుతుండగా ఓ మొసలి లోపలకు లాగేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్​ ఉద్ధమ్​సింగ్​ నగర్​ జిల్లాలో జరిగింది. గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు.

  • మొసలిని పెళ్లాడిన 'మేయర్'.. గ్రాండ్​గా పార్టీ.. ప్రజల కోసమేనట!

సంప్రదాయ దుస్తులు, మేళతాళాలు, అతిథుల కోలాహలం మధ్య మెక్సికోలోని ఓ గ్రామంలో జరిగిన వివాహం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వరుడు ప్రజాప్రతినిధి కాగా.. వధువు మొసలి కావడమే ఇందుకు కారణం. ఇంతకీ ఎందుకిలా? ఈ మకర వివాహం వెనుక మర్మమేంటి?

  • ఇంగ్లాండ్‌ గడ్డపై బుమ్రా మరో రికార్డు

టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

  • హీరో మాధవన్​పై రజనీకాంత్​ కామెంట్స్​.. ఏమన్నారంటే?

'రాకెట్రీ' సినిమాపై ప్రశంసలు కురిపించారు సూపర్​స్టార్​ రజనీకాంత్. నంబి నారాయణన్‌ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.