ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలునిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని.. కేంద్రంలో ఉన్న 15 లక్షల పైగా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. యాదాద్రికి సీఎం కేసీఆర్...యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా ఉన్న... శ్రీ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి శివాలయం పునఃప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఉద్ఘాటన పర్వంలో 25న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.పరీక్షలన్నీ రాసేలా... రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైన పరీక్షల నిర్వహణలో సాంకేతిక అడ్డంకుల్ని అధిగమించేలా నియామక సంస్థలు సమన్వయం చేసుకోనున్నాయి. ఏదేని నియామక సంస్థ పరిధిలోని పోస్టుల భర్తీకి ఖరారైన పరీక్షల తేదీకి, మరో నియామక సంస్థ పరిధిలోని పోస్టుల భర్తీకి ఖరారైన పరీక్షల తేదీకి మధ్య కొంత వ్యవధి ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నాయి.స్పేస్ టెక్నాలజీ పాలసీ ఆవిష్కరణ..అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ తెలంగాణను ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన పరిశ్రమలు, ఐటీశాఖా మంత్రి కేటీఆర్.. ఈ రంగంలో సాంకేతికతలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు. గడీల పాలన పోవాల్సిందే.. బరాబర్ పాదయాత్ర చేస్తామని... దమ్ముంటే కేసీయార్ పాదయాత్ర చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ సవాల్ విసిరారు. ప్రజలకు తెరాస సర్కారు చేసిందేమిటో వివరించాలని... భాజపా ఏం చేసిందో చెబుతామన్నారు. మా విధానం అదే..'సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్'తో భారతీయులు సాధికారత పొందుతున్నారని దేశం ఉజ్వల భవిష్యత్తుతో ముందుకెళ్తుందన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీ ప్రభుత్వ హయాంలో విద్వేషపూరిత ప్రసంగాలు, మత పరమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు.న్యాయం చేయండి.. తన భార్య పొరుగింటి వ్యక్తి లక్ష రూపాయాలకు అమ్మేశాడంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్, ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. తన భార్య అందంగా ఉంటుందని, చదువుకుందని.. అందుకే విక్రయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.రష్యా క్షిపణుల ప్రయోగం..మేరియుపొల్‌లో తమవాళ్లను పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడానికి ప్రత్యేక గదుల్ని (టార్చర్ ఛాంబర్లను) రష్యా ఏర్పాటు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. విక్రమ్-మురుగదాస్ కాంబో.. తమిళంలో విక్రమ్-మురుగదాస్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతుందని సినీవర్గాల నుంచి సమాచారం అందుతోంది. మురుగదాస్ చెప్పిన లైన్ విక్రమ్‌కు నచ్చిందట. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందట.రొనాల్డో ఇంట విషాదంపోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జార్జినా-రొనాల్డో దంపతులకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతిచెందారు.