ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 11AM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
top news
author img

By

Published : Apr 18, 2022, 10:59 AM IST

నేటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. భక్తులు జరిపించే స్వామివారి నిత్యకల్యాణం కూడా ప్రారంభం కానుంది. రేపట్నుంచి శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించనున్నారు.

  • ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైన కుమురం భీం జిల్లా

POSHAN ABHIYAN: పోషణ్​ అభియాన్ కార్యక్రమ అమలులో భాగంగా 2021 సంవత్సరానికి గానూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు పట్ల మంత్రి సత్యవతి రాఠోడ్​ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన సంబంధిత అధికారులను ఆమె అభినందించారు.

  • అసెంబ్లీని ముట్టడించిన 3 లక్షల మంది డ్రైవర్లు

ఒడిశా అసెంబ్లీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు డ్రైవర్లు. దాదాపు 3లక్షల మంది డ్రైవర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని రోడ్డెక్కారు.

  • 'త్వరలో భాజపాయేతర సీఎంల భేటీ!'

Non BJP CMs Meeting: ముంబయి వేదికగా భాజపాయేతర ముఖ్యమంత్రుల భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు రౌత్‌ వెల్లడించారు.

  • నెల్లూరులో పోటాపోటీ సభలు...

Minister and Ex minister meeting in Nellore: అధిష్ఠానం జోక్యంతో ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైకాపా అంతర్గత పోరుకు తాత్కాలికంగా తెరపడింది. బలప్రదర్శనే లక్ష్యంగా పోటాపోటీ సభలు నిర్వహించినా.. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ పరస్పరం విమర్శల జోలికిపోలేదు. అధినాయకత్వం జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock market News: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1041 పాయింట్లు కోల్పోయి 57,297కి పడిపోయింది. నిఫ్టీ 245 పాయింట్లు క్షీణించి 17,230 వద్ద ట్రేడవుతోంది.

  • 'బ్లడీ మేరీ' ఎలా ఉందంటే?

Niveda pethuraj Bloody mary movie review: హీరోయిన్​ నివేదా పేతురాజ్​ నటించిన తాజా చిత్రం 'బ్లడీ మేరీ'. చందూ మొండేటి దర్శకుడు. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా విడుదలై స్ట్రీమింగ్​ అవుతోంది. మరి సినిమా కథేంటి? ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి..

  • కౌంటీల్లో పుజారా డబుల్‌ సెంచరీ

Cheteshwar Pujara: ఫామ్​లేమితో భారత జట్టులో చోటు కోల్పోయిన టెస్టు స్పెషలిస్ట్​ ఛెతేశ్వర్ పుజారా.. ఇంగ్లాండ్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ససెక్స్​ తరఫున ఆడుతున్న పుజారా అరంగేట్రంలోనే డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పించాడు.

  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Covid Cases In India: దేశంలో కొత్తగా 2,183 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా మరో 214 మంది చనిపోయారు.

  • సిద్ధమైన తెలంగాణ 'స్పేస్‌-టెక్‌'

Space-Tech: అంతరిక్ష సేవల్లోనూ దూసుకుపోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ 'స్పేస్‌-టెక్‌' విధానాన్ని.. మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా విడుదల చేయనున్నారు.

  • యాదాద్రిలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

నేటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. భక్తులు జరిపించే స్వామివారి నిత్యకల్యాణం కూడా ప్రారంభం కానుంది. రేపట్నుంచి శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించనున్నారు.

  • ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైన కుమురం భీం జిల్లా

POSHAN ABHIYAN: పోషణ్​ అభియాన్ కార్యక్రమ అమలులో భాగంగా 2021 సంవత్సరానికి గానూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు పట్ల మంత్రి సత్యవతి రాఠోడ్​ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన సంబంధిత అధికారులను ఆమె అభినందించారు.

  • అసెంబ్లీని ముట్టడించిన 3 లక్షల మంది డ్రైవర్లు

ఒడిశా అసెంబ్లీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు డ్రైవర్లు. దాదాపు 3లక్షల మంది డ్రైవర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని రోడ్డెక్కారు.

  • 'త్వరలో భాజపాయేతర సీఎంల భేటీ!'

Non BJP CMs Meeting: ముంబయి వేదికగా భాజపాయేతర ముఖ్యమంత్రుల భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు రౌత్‌ వెల్లడించారు.

  • నెల్లూరులో పోటాపోటీ సభలు...

Minister and Ex minister meeting in Nellore: అధిష్ఠానం జోక్యంతో ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైకాపా అంతర్గత పోరుకు తాత్కాలికంగా తెరపడింది. బలప్రదర్శనే లక్ష్యంగా పోటాపోటీ సభలు నిర్వహించినా.. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ పరస్పరం విమర్శల జోలికిపోలేదు. అధినాయకత్వం జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock market News: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1041 పాయింట్లు కోల్పోయి 57,297కి పడిపోయింది. నిఫ్టీ 245 పాయింట్లు క్షీణించి 17,230 వద్ద ట్రేడవుతోంది.

  • 'బ్లడీ మేరీ' ఎలా ఉందంటే?

Niveda pethuraj Bloody mary movie review: హీరోయిన్​ నివేదా పేతురాజ్​ నటించిన తాజా చిత్రం 'బ్లడీ మేరీ'. చందూ మొండేటి దర్శకుడు. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా విడుదలై స్ట్రీమింగ్​ అవుతోంది. మరి సినిమా కథేంటి? ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి..

  • కౌంటీల్లో పుజారా డబుల్‌ సెంచరీ

Cheteshwar Pujara: ఫామ్​లేమితో భారత జట్టులో చోటు కోల్పోయిన టెస్టు స్పెషలిస్ట్​ ఛెతేశ్వర్ పుజారా.. ఇంగ్లాండ్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ససెక్స్​ తరఫున ఆడుతున్న పుజారా అరంగేట్రంలోనే డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.