ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Feb 3, 2022, 12:59 PM IST

Telangana top news
టాప్​ న్యూస్ @ 1PM
  • 'ఆన్​లైన్ బోధన కొనసాగించండి'

TS High Court on Corona: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్​లైన్ బోధన కొనసాగించాలంది.

  • మహా ధర్నా వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.?

Teachers Maha dharna on February 09th: జీవో 317 కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ఈ నెల 9 న హైదరాబాద్​ ధర్నాచౌక్​లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల స్టీరింగ్​ కమిటీ ప్రకటించింది. తొలుత ఈ నెల 5 న ధర్నా చేపట్టాల్సి ఉండగా.. ప్రధాని పర్యటన దృష్ట్యా 9వ తేదీకి వాయిదా వేసింది.

  • ' కేసీఆర్​ క్షమాపణ చెప్పాల్సిందే'

BJP Bheem Deeksha : పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసన దీక్ష చేపట్టింది. దిల్లీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మౌనదీక్ష చేపట్టగా.. రాష్ట్రంలో భాజపా భీం దీక్ష పేరిట నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

  • ముగిసిన టోనీ కస్టడి.. జైలుకు తరలింపు

Drug Dealer Tony Custody Ends: నైజీరియన్ డ్రగ్ డీలర్ టోనీ కస్టడీ ముగిసింది. వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పంజాగుట్ట పోలీసులు.. అనంతరం చంచల్ గూడా జైలుకు తరలించారు. టోనీతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రధాన ఏజెంట్ ఇమ్రాన్ భార్య ఫిర్దోస్​ను కూడా అరెస్టు చేశారు.

  • అరగంట పాటు ఐస్‌ గడ్డల్లో..

Limca book of record feet: కాస్త చలి ఎక్కువైతేనే మనం వణికిపోతాం. చల్లటి వాతావరణంలో కాసేపు కూడా ఉండలేం. కానీ ఒకతను ఏకంగా ఐస్​ గడ్డలు వేసుకుని మరీ అందులో ఏకంగా అరగంటపాటు కూర్చున్నారు. అలా ఎందుకు చేశాడనుకుంటున్నారా? అదేనండి లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డు కోసమేనట. ఇంతకీ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే చూసేయండి.

  • రాహుల్ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే?

Rahul gandhi news: ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థ విధానాల వల్లే పాకిస్థాన్​-చైనా కలిశాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. వీటిని తాము సమర్థించలేమని పేర్కొంది. అంతేగాక, పాకిస్థాన్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఇస్లామాబాద్‌తో తమకు కీలకమైన బంధం ఉందని చెప్పింది.

  • చిన్నారిపై సొంత మామ అత్యాచారం!

Jalore Rape: సొంత మామే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అరుపులు విని తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

  • విద్యుత్తు తీగలు పడి 26 మంది మృతి

Power Cables Collapse Congo: వర్షం కారణంగా మార్కెట్లో హైఓల్టేజ్​ విద్యుత్తు తీగలు తెగిపడి 26 మంది మృతిచెందారు. కాంగోలో జరిగిన ఈ ఘటనలోని మృతుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

  • మహేశ్​ అందుకే రాలేదా?

Maheshbabu Trivikram hatrick movie: హీరో మహేశ్​బాబు-దర్శకుడు త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్​ సినిమా షూటింగ్​ మొదలైంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి మహేశ్​ రాలేదు.

  • వన్డే సిరీస్​ వాయిదా?

IND VS WI ODI Series Postpone: ఆటగాళ్లు కరోనా బారిన పడటం వల్ల వన్డే సిరీస్​ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జట్టులో మరిన్ని పాజిటివ్​ కేసులు బయటపడితే సిరీస్​ను వాయిదా వేయాలని బోర్డు యోచిస్తున్నట్లు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.