ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్ @ 7AM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్​ న్యూస్ @ 7AM
author img

By

Published : Feb 3, 2022, 6:59 AM IST

  • హైకోర్టుకు 12 మంది జడ్జిలు

సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సిఫార్సు చేసింది. మంగళవారం దిల్లీలో సమావేశమైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం మొత్తం దేశంలోని 7 హైకోర్టులకు 27 మంది పేర్లను సిఫార్సు చేయగా వారిలో ఎక్కువ మందిని తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు.

  • హైదరాబాద్​కు​ ప్రధాని మోదీ

PM Modi Hyderabad Visit: ప్రధాని నరేంద్రమోదీ ఎల్లుండి హైదరాబాద్​కు రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం చేరుకుంటారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరవడం సహా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

  • బండి ​ మౌనదీక్ష..

BJP Bheem Deeksha: దిల్లీలోని రాజ్​ఘాట్​ వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మౌనదీక్ష చేయనున్నారు. రాజ్యాంగం మార్చాలంటూ కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై.. 'భాజపా భీం దీక్ష' చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.

  • రాష్ట్ర బడ్జెట్​ కసరత్తు వేగవంతం

పన్ను ఆదాయం అంచనాలను చేరుకుంటున్న వేళ... వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర బడ్జెట్ భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు పన్ను అంచనాలను 70 శాతం చేరుకొంది. ఈ ఏడాది లక్షా 50 వేల కోట్ల వ్యయం చేస్తామంటోన్న ప్రభుత్వం... వచ్చే ఏడాదికి మరో 30 వేల కోట్లు పెరుగుతుందని చెబుతోంది

  • కొత్త రైళ్లు, లైన్లూ లేవు

Union Budget 2022: కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చింది. రైల్వేకు గతేడాది కంటే రూ.30 వేల కోట్లు అధికమని ఆ శాఖ ఘనంగా చెప్పినా రాష్ట్రానికి ఆ మేరకు కేటాయింపులు కనిపించడం లేదు. నూతనంగా రైల్వే లైన్లు మంజూరు చేయలేదు. కొత్త రైళ్లూ ఇవ్వలేదు.

  • టార్గెట్ దిల్లీ.. ముగ్గురి సరికొత్త రాజకీయం!

మూడు రాష్ట్రాలు... ముగ్గురు ముఖ్యమంత్రులు.. పార్టీలు వేర్వేరు.. కానీ నినాదం ఒక్కటే.. 'ప్రత్యామ్నాయం!'. అంతర్లీనంగా దాగి ఉన్న సందేశం 'టార్గెట్ దిల్లీ'. బంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్​.. ప్రస్తుతానికి విడివిడిగానే సాగిస్తున్న రాజకీయం ఇది.

  • ' భూమండలంలోనే తొలిసారి!'

భక్తులు, వేద పండితుల శ్రీమన్నారాయణ నామస్మరణతో మొదలైన శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు తొలిరోజు వైభవంగా జరిగాయి. పెరుమాళ్ల శోభాయాత్ర, విశ్వక్ సేనుడి ఆరాధన, వాస్తుశాంతి శోభాయమానంగా నిర్వహించి వేడుకలకు అంకురార్పణ చేసిన చినజీయర్​ స్వామి.. నేడు అగ్నిహోత్రం ఆవిష్కరణతో యాగశాలలోని 1035 కుండలాలలో హోమం నిర్వహించనున్నారు. ఇంత పెద్ద హోమం చేయడం భూమండలంలోనే తొలిసారని వేదపండితులు తెలిపారు.

  • రంగంలోకి ఈడీ?

Drugs Case: మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు టోనీ కస్టడీ విచారణ ముగిసింది. గత నెల 29 నుంచి బుధవారం వరకు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు విచారించారు. ప్రధానంగా టోనీ కాల్‌డేటాపై దృష్టిసారించిన పోలీసులు.. అతనిచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో టోనీ ప్రధాన అనుచరుడు ఇమ్రాన్‌ బాబు షేక్‌ భార్య ఫిర్‌దోస్‌ ఉంది.

  • అమెరికాపై పుతిన్​ ఆగ్రహం

US Troops in Europe: ఉక్రెయిన్​పై రష్యా దాడి చేసే అవకాశముందన్న భయాల నేపథ్యంలో ఐరోపాకు తమ సైనికులను పంపినట్లు అమెరికాలోని పెంటగాన్​ ప్రతినిధి తెలిపారు. జర్మనీ, పోలాండ్​ దేశాలకు వారిని తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​.

  • యంగ్​ఇండియా ఎనిమిదోసారి..

Under 19 World cup 2022: అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత​ జట్టు ఫైనల్​కు చేరింది. ఆస్ట్రేలియాపై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఎనిమిదోసారి ​ఫైనల్లో అడుగు పెట్టింది. కెప్టెన్ యష్ దుల్(110) అద్భుతమైన సెంచరీతో మెప్పించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.