ETV Bharat / city

నంద్యాల నుంచి రాష్ట్రానికి పయనమైన విద్యార్థులు - kurnool dst corona news

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో తెలంగాణకు చెందిన 610 మంది బ్యాంకు కోచింగ్ విద్యార్ధులను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. పరీక్షల శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు లాక్​డౌన్​ సందర్భంగా నంద్యాలలోనే ఉండి పోయారు.

telangana students
నంద్యాల నుంచి రాష్ట్రానికి పయనమైన విద్యార్థులు
author img

By

Published : May 4, 2020, 11:55 PM IST

కేంద్ర ప్రభుత్వ లాక్​డౌన్​ ఆదేశాలతో ఏపీలో ఉండిపోయిన రాష్ట్ర విద్యార్థులను అధికారులు వారి స్వస్థలాలకు పంపుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇరుక్కుపోయిన 610 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించారు. తాము పడుతున్న ఇబ్బందులను విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి , మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రెండు ప్రభుత్వాలు స్పందించి విద్యార్థులు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమం చేశాయి. ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో వారిని రాష్ట్రానికి పంపించినట్లు నంద్యాల ఆర్డీవో తెలిపారు.

ఇవీచూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.