ETV Bharat / city

యుద్ధభూమిలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. భయంతో బిక్కుబిక్కుమంటూ.. - Ukraine latest news

రష్యాతో యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న రాష్ట్ర విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు... స్వస్థలాలకు రావడానికి విమానాల్లేక దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకు పలు విశ్వవిద్యాలయాలు ముందుకురావడంతో.. రాష్ట్రానికి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు.

telangana-students-are-tensed-for-stuck-in-ukraine

author img

By

Published : Feb 25, 2022, 6:31 AM IST

Updated : Feb 25, 2022, 7:04 AM IST

యుద్ధభూమిలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. భయంతో బిక్కుబిక్కుమంటూ..

రాష్ట్రానికి చెందిన చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నారు. రష్యా యుద్ధం ప్రారంభించడంతో... దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో... భీకర బాంబుల శబ్ధాల మధ్య.. గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తూ.. స్వస్థలాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు.. కావాల్సిన నిత్యావసరాలను ముందే తీసుకొచ్చుకుని.. అందుబాటులో పెట్టుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంత త్వరగా తమను స్వస్థలాకు తీసుకురావాలని.. హైదరాబాద్‌ కర్మాన్‌ఘాట్‌కు చెందిన వైతరిణి విజ్ఞప్తి చేశారు.

"నిత్యావసరాల కోసం బయటికి వస్తే.. అన్ని అయిపోయాయంటున్నారు. డబ్బులు డ్రా చేద్దామన్నా.. ఏటీఎంలు పనిచేయట్లేవు. అంతా భయంభయంగా ఉంది. స్టూడెంట్స్​ అందరూ టెన్షన్​ పడుతున్నారు. భారత ప్రభుత్వం మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం." -వైతరిణి, వైద్య విద్యార్థిని, కర్మాన్‌ఘాట్‌

నిజామాబాద్‌కు చెందిన మేధ.. బోధన్‌కు చెందిన వినయ్.. కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన రాహుల్... ఉక్రెయిన్‌లో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. నస్రుల్లాబాద్‌కు చెందిన సచిన్ గౌడ్..... భీంగల్ మండలానికి చెందిన నితిన్, చరణ్.. భారత రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. వీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన దుర్గాప్రసాద్.... కార్గివ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. గజ్వేల్ మండలం వేల్పూరుకు చెందిన ప్రవళిక, కొండపాకకు చెందిన అజిత్, జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన నిహారికరెడ్డి వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ప్రస్తుతానికి తానున్న ప్రాంతంలో ఎలాంటి అలజడులు లేవని నిహారికరెడ్డి చెబుతున్నారు.

"కరీంనగర్​, ఆంధ్రా వాళ్లతో పాటు కేరళలాంటి రాష్ట్రాల వాళ్లు మొత్తం 1500 మంది ఇండియన్స్​ ఉన్నాం. ఇప్పుడైతే మేమున్న ప్రాంతంలో ఎలాంటి అలజడి లేదు. అంతా ప్రశాంతంగానే ఉంది." - నిహారిక రెడ్డి, వైద్య విద్యార్థిని, జగిత్యాల జిల్లా

8 నెలల కిందట ఉక్రెయిన్‌లోని కంపెనీలో పనిచేసేందుకు వెళ్లిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరిమెట్ల చెందిన వైనాల రాజు... కీవ్‌ నగరంలో తమకు సమీపంలోనే బాంబు దాడి జరిగిందని కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇసుక మేరికి చెందిన అమూల్య.. వినిష్టాలో ఎంబీబీఎస్​ చదువుతోంది. తాము నివసిస్తున్న పట్టణంలోని పరిస్థితులను.. తల్లిదండ్రులకు తెలిపి.. భయభ్రాంతులకు గురయ్యింది.

"మేముంటున్న ప్రాంతానికి కొంచెం దూరంలోనే బాంబులు పేలుతున్నాయి. ఆ బ్లాస్టులు మాకు కన్పిస్తున్నాయి. 26 రోజు ఇండియాకు వచ్చేద్దామని టికెట్లు బుక్​ చేసుకున్నాం. ఇప్పుడేమో ఇలా జరుగుతుంది. యూనివర్శిటీ కూడా ఎలాంటి అప్​డేట్​ ఇవ్వలేదు. ఏం చేయ్యాలో అర్థం కావట్లేదు." - అమూల్య, వైద్య విద్యార్థిని, మహబూబాబాద్ జిల్లా

"నేను ప్రస్తుతం ఖర్కీవ్‌ మెడికల్‌ వర్సిటీలో మెడిసిన్‌ నాలుగో ఏడాది చదువుతున్నా. గత ఏడాది అక్టోబరులోనే ఉక్రెయిన్‌ వచ్చాను. ఇక్కడ బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. అన్ని వస్తువులు ప్యాక్‌ చేసుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. బయట మార్కెట్‌లో అన్ని వస్తువులు ఖాళీ అయిపోయాయి. ఆహార పదార్థాలు, నీళ్లు ముందుగానే నిల్వ చేసుకున్నాం."- షాహీన్‌, వైద్య విద్యార్థిని

"2018లో మెడిసిన్‌ చదివేందుకు ఉక్రెయిన్‌ వచ్చా. మేం ఉంటున్న ఖర్కీవ్‌ ప్రాంతానికి కొంచెం దూరంలో దాడులు జరుగుతున్నాయి. ప్రజలు నివాస ప్రాంతాలపై దాడులు లేవు. నగరంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా దుకాణాల్లో సరకులు లేవు. వచ్చే నెల 3న భారత్‌ వచ్చేందుకు టికెట్లు బుక్‌ చేసుకున్నాం." -హుస్సేన్‌, వైద్య విద్యార్థి

"నేను మెడిసిన్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు వేలకు పైగా విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్నారు. వారం నుంచి స్వదేశానికి రావాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. కేంద్రం స్పందించి క్షేమంగా తీసుకురావాలి." - రోహిత్‌, తరుణ్‌, హైదరాబాద్‌

రేట్లు అమాంతం పెంచేశారు..

సీతాఫల్‌మండికి చెందిన గడిపె మనోహర్‌, శాంతి దంపతుల పెద్దకుమార్తె అనీల 2016లో మెడిసిన్‌ చదివేందుకు ఉక్రెయిన్‌ వెళ్లారు. విమాన ఛార్జీలు ఎంతైనా భారత్‌కు తిరిగిరావాలంటూ తాము అనీలకు ఫోన్‌లో సూచించామని తండ్రి తెలిపారు. అక్కడ చిక్కుకున్న వారందరినీ క్షేమంగా రప్పించాలని ఉపసభాపతి పద్మారావు ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

"మేం ముగ్గురం ఒకే చోట ఉన్నాం. ఈనెల 23న కావాల్సిన సరకులన్నీ తెచ్చుకుని పెట్టుకోవాలంటూ ఇక్కడి అధికారులు చెప్పారు. ఆరోజు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో మేము ఉంటున్న ప్రాంతానికి 20 కి.మీ. దూరంలో బాంబులు పేలాయి. చాలా భయపడ్డాం. భారత్‌కు రూ.30వేలు ఉన్న విమాన ఛార్జీలు రూ.60-90వేలకు పెంచారు" - అనీల, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి..

మా పిల్లలని కాపాడండి..

భువనగిరి ప్రగతినగర్‌కి చెందిన చెన్న గౌరీ శంకర్ కుమారుడు... పృథ్విరాజ్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ధైర్యంగా ఉండాలని.. తల్లిదండ్రులు కుమారుడికి భరోసా కల్పించారు. వీలైనంత త్వరగా...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిల్లల్ని రప్పించాలని కోరుతున్నారు.

"మా కొడుకు ఉక్రేయిన్​లో ఉన్నాడు. తల్లిదండ్రులుగా మేం చాలా ఆందోళన చెందుతున్నాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని.. మా పిల్లలను ఇక్కడకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలి. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఏ ఛానల్​ చూసినా యుద్ధం గురించే చెప్తుంటే.. గుండెలు భయంతో నిండిపోతున్నాయి. ప్రభుత్వాలే దయ తలచి మా పిల్లల్ని ఇక్కడికి రప్పించాలి" - గౌరీ శంకర్​, పృథ్విరాజ్​ తండ్రి, భువనగిరి

వాయు మార్గం నిలిచిపోవడంతో... కనీసం రోడ్డు మార్గంలోనైనా తమను పక్క దేశాలకు తరలించాలని ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Feb 25, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.