ETV Bharat / city

డాక్టర్ కాబోతున్న డీజీపీ మహేందర్ రెడ్డి!

author img

By

Published : May 30, 2020, 12:55 PM IST

రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ) ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి ఇక డాక్టర్‌ మహేందర్‌రెడ్డి కాబోతున్నారు. ఆయన తాజాగా జేఎన్టీయూహెచ్‌ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.

telangana state director general of police mahender reddy got doctorate
డాక్టర్ కాబోతున్న డీజీపీ మహేందర్ రెడ్డి!

రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జేఎన్టీయూ నుంచి పీహెచ్​డీ పూర్తి చేసి డాక్టర్ మహేందర్ రెడ్డి కాబోతున్నారు.. 1986 సివిల్‌ సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ఎన్‌ఐటీ వరంగల్‌ నుంచి బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌, ఆ తర్వాత ఎన్‌ఐటీ దిల్లీలో ఎంటెక్‌ చదువుతుండగా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

దాదాపు దశాబ్దం క్రితం పీహెచ్‌డీ విద్యార్థిగా పేరును నమోదు చేసుకున్న మహేందర్‌రెడ్డి ఇటీవలే ‘‘నేరాల నియంత్రణ.. సాంకేతిక వినియోగం...తనిఖీలు, చర్యలు’పై జేఎన్టీయూహెచ్‌లోని మేనేజ్‌మెంట్‌ విభాగానికి థీసిస్‌ను సమర్పించారు. పోలీసు అకాడమీలో విశ్రాంత ఆచార్యుడైన అనిల్‌కుమార్‌ సక్సేనా ఆయనకు గైడ్‌గా వ్యవహరించారు.

విశ్వవిద్యాలయం సిద్ధాంత పత్రాన్ని మూల్యాంకనం కోసం ఇతర రాష్ట్రాల్లోని ముగ్గురు ఆచార్యులకు పంపగా వారు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో జేఎన్టీయూహెచ్‌ ఆయనకు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు ఆన్‌లైన్‌లో వైవా నిర్వహించింది. దీనికి ఎక్స్‌టర్నల్‌ మూల్యాంకనదారుగా ఐఐఎం బెంగళూరు ఆచార్యుడు గోపాల్‌ మహాపాత్ర వ్యవహరించారు. అడిగిన ప్రశ్నలకు మహేందర్‌రెడ్డి సంతృప్తికరంగా సమాధానాలు చెప్పడంతో ఆయనకు పీహెచ్‌డీ పట్టా ఇవ్వాలని విశ్వవిద్యాలయం నిర్ణయించిందని జేఎన్టీయూహెచ్‌ ఆర్‌ అండ్‌ డి విభాగం సంచాలకుడు కె.విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.