ETV Bharat / city

Speaker Pocharam tested Corona Positive : సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్

Speaker Pochahram tested Corona Positive

author img

By

Published : Nov 25, 2021, 11:07 AM IST

Updated : Nov 25, 2021, 11:43 AM IST

11:04 November 25

Speaker Pocharam tested Corona Positive: కరోనా బారిన పడిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Speaker Pocharam tested Corona Positive : శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. నిన్న రాత్రి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న స్పీకర్‌కు కరోనా వచ్చినట్లు తేలింది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలతో హోం ఐసోలేషన్​లో ఉండాలని పోచారం కోరారు. 

ఇటీవలే శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

Corona Third Wave Telangana: రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, అధికారులు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. మూడో దశ ముప్పు ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ఇవీ చదవండి  :  

Last Updated : Nov 25, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.