రాష్ట్రంలో నాలుగో కరోనా పాజిటివ్ కేసు నమోదైనప్పటికీ... ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేసుకోవడం లేదు. ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. గడిచిన వారంరోజులుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఆర్టీసీ బస్సులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగడం, బస్సుల్లో ఉన్న సీట్లను, లోపలి భాగాలను తుడవడం, బస్టాండ్లలో సీట్లను శుభ్రపరచడం, బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ఆర్టీసీ లాభాలకు ఓ కారణం.
డ్రైవర్లు, కండర్టర్లు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారని, కరోనా కరపత్రాలు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అందుకే గడిచిన వారం రోజుల్లో ఆర్టీసీ ఆదాయం సుమారు రూ.2.5 కోట్ల వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
తేదీ | ఆక్యుపెన్సీ రేషియో | ఆదాయం |
మార్చి 11 | 63 శాతం | రూ.11.87 కోట్లు |
మార్చి 12 | 69 శాతం | రూ.12.97 కోట్లు |
మార్చి 13 | 64 శాతం | రూ.12.01 కోట్లు |
మార్చి 14 | 61శాతం | రూ.11.63 కోట్లు |
మార్చి 15 | 68 శాతం | రూ.12.52 కోట్లు |
మార్చి 16 | 74 శాతం | రూ.14.35 కోట్లు |
ఇదీ చూడండి: 'కేసీఆర్, ఒవైసీ కూడా ఎన్పీఆర్లో నమోదు చేయించుకోవాల్సిందే'