ETV Bharat / city

TS Corona: రాష్ట్రంలో కొత్తగా 340 కేసులు.. ఆ వయసు వారికే ఎక్కువగా వైరస్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 340 మందికి వైరస్​ సోకింది. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,891 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

TS Corona
TS Corona
author img

By

Published : Aug 30, 2021, 7:58 PM IST

రాష్ట్రంలో కొత్తగా 340 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,57,716 మంది కరోనా బారిన పడ్డారు. 359 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,47,953 మందికి చేరింది. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు 3,872 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పెరిగిన పాజిటివిటీ రేటు

గడిచిన 24 గంటల్లో 75,102 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 1,658 మంది రిపోర్ట్స్​ రావల్సి ఉంది. ఇప్పటివరకు 2,45,59,439 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 జిల్లాలో పదిలోపే కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్​లో 72 మందికి వైరస్ సోకింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు

తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్​ఎంసీ 72, జగిత్యాల 15, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 1, జోగులాంబ గద్వాల 3, కామారెడ్డి 2, కరీంనగర్ 42, ఖమ్మం 17, కొమురంభీం ఆసిఫాబాద్ 0, మహబూబ్​నగర్ 3, మహబూబాబాద్ 5, మంచిర్యాల 8, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 19, ములుగు 2, నాగర్​కర్నూల్ 3, నల్గొండ 25, నారాయణపేట 1, నిర్మల్ 2, నిజామాబాద్ 4, పెద్దపల్లి 19, రాజన్న సిరిసిల్ల 9, రంగారెడ్డి 10, సంగారెడ్డి 2, సిద్దిపేట 6, సూర్యాపేట 11, వికారాబాద్ 1, వనపర్తి 0, వరంగల్ 8, హనుమకొండ 25, యాదాద్రి భువనగిరి 9 చొప్పున నమోదయ్యాయి.

ఇదీ చదవండి : డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ మొదలైంది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.