ETV Bharat / city

సుపరిపాలనలో.. తెలంగాణకు 11వ స్థానం..!

సుపరిపాలన సూచీలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ సూచీని విడుదల చేసింది. ఆర్థిక, సామాజిక, అభివృద్ధి తదితర అంశాలను పరిగణిస్తూ శాస్త్రీయంగా రూపొందించింది.

Telangana ranked 11th in the governance index ..!
సుపరిపాలనలో.. తెలంగాణకు 11వ స్థానం..!
author img

By

Published : Dec 26, 2019, 5:16 AM IST

Updated : Dec 26, 2019, 7:34 AM IST

కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఓ సూచీని విడుదల చేసింది. వ్యవసాయం.. అనుబంధ రంగాలు, వాణిజ్యం, పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజారోగ్యం, ప్రభుత్వ మౌలిక వసతులు, సదుపాయాలు, ఆర్థిక పాలన, సామాజిక సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలను పరిగణిస్తూ శాస్త్రీయంగా రూపొందించింది.

ముసాయిదా నివేదికను కేంద్ర ప్రభుత్వం 2018 నవంబరు 6న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. వాటి నుంచి లభించిన స్పందన ఆధారంగా సుపరిపాలన సూచీకి రూపమిచ్చింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ దానిని ఆవిష్కరించారు.

  1. ఎంపిక చేసుకున్న పది పాలనాంశాలకు ఒక్కో దానికి ఒక్కో మార్కు కింద మొత్తం పది మార్కులకు ర్యాంకింగ్‌ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉన్నాయి.
  2. ఆంధ్రప్రదేశ్‌ 5.05 మార్కులతో 5, తెలంగాణ 4.83 మార్కులతో 11వ స్థానాల్లో నిలిచాయి.
  3. పెద్ద రాష్ట్రాల్లో 5.62 మార్కులతో తమిళనాడు మొదటి, 4.23 మార్కులతో ఝార్ఖండ్‌ చివరి స్థానాల్లో ఉన్నాయి.
  4. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏపీ 0.48 స్కోర్‌తో ఆరు, 0.29 స్కోర్‌తో తెలంగాణ 17వ స్థానాల్లో నిలిచాయి.
  5. పరిశ్రమలు, వాణిజ్యంలో 0.94 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ రెండు, 0.93 స్కోర్‌తో తెలంగాణ మూడో స్థానం పొందాయి.
  6. మానవ వనరుల అభివృద్ధిలో 0.58 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిది, 0.55 స్కోర్‌తో తెలంగాణ 11వ స్థానాల్లో నిలిచాయి.
  7. ప్రజారోగ్యం విషయంలో 0.63 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఏడు, 0.63 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిది స్థానాలు సాధించాయి.
  8. మౌలిక వసతులు, సదుపాయాల్లో 0.70 స్కోర్‌తో తెలంగాణ ఆరు, 0.66 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.
  9. ఆర్థిక పాలనలో 0.63 స్కోర్‌తో తెలంగాణ మూడు, 0.55 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఏడు స్థానాలు సాధించాయి.
  10. సామాజిక సంక్షేమం, అభివృద్ధి విషయంలో 0.57 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ మూడు, 0.46 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిది స్థానాలు అందుకున్నాయి.
  11. న్యాయ, ప్రజాభద్రతలో 0.30 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిది, 0.22 స్కోర్‌తో తెలంగాణ 16వ స్థానాల్లో నిలిచాయి.
  12. పర్యావరణంలో 0.49 స్కోర్‌తో తెలంగాణ 16.., 0.40 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ 17 స్థానాలు అందుకున్నాయి.

ఇవీ చూడండి: కేబీఆర్​ పార్క్​ను సందర్శించిన సీఎస్​ దంపతులు

Intro:Body:Conclusion:
Last Updated : Dec 26, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.