ETV Bharat / city

'కర్తవ్యంలోనే కాదు.. క్రీడల్లోనూ నంబర్ వన్'

శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు.. తెలంగాణ పోలీసులు క్రీడల్లోనూ నంబర్ వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్​గా నిలిచారని, మిగతా రాష్ట్రాల వారు మన పోలీసులను అనుసరిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నగర పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వార్షిక ( 2021) క్రీడోత్సవాలను మంత్రి ప్రారంభించారు.

telangana-police-sports-meet-2021-at-goshamahal-ground-in-hyderabad
గోషామహల్​లో తెలంగాణ పోలీసుల వార్షిక క్రీడోత్సవాలు
author img

By

Published : Feb 9, 2021, 1:20 PM IST

కరోనా కాలంలో తెలంగాణ పోలీసులు చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత పోలీసు శాఖకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర పోలీసుల కృషిని దేశమంతా గుర్తించిందని వెల్లడించారు. హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో గోషామహల్​ మైదానంలో నిర్వహిస్తోన్న వార్షిక 2021 క్రీడలను డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్​లతో కలిసి ప్రారంభించారు.

క్రీడలు.. పోలీసుల్లో టీమ్​ స్పిరిట్​ను పెంచడానికి, శరీరం దృఢంగా ఉంచుకోవడానికి దోహదం చేస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీసులు చేసే ప్రతి పనిలో టీమ్ వర్క్ ముఖ్యమని తెలిపారు. రక్షక భటులకు శారీరక దృఢత్వం ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు విజయవంతం అవుతున్నారని వెల్లడించారు.

నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సీపీ అంజనీకుమార్ అన్నారు. చట్టాలను అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. సాంకేతికతను ఉపయోగించుకుని అమాయకులకు వల వేసే వారి ఆట కట్టిస్తున్నామని చెప్పారు. 2020లో కరోనా వల్ల స్పోర్ట్స్ మీట్ పెట్టలేకపోయామన్న సీపీ.. గత ఏడేళ్లలో తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయంగా మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్​లో రాష్ట్ర పోలీసులు ముందున్నారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.