ETV Bharat / city

లాక్​డౌన్​ వేళ గృహహింస బాధితురాళ్లకు అండగా..

లాక్​డౌన్ సమయంలో గృహహింస బారిన పడుతున్న మహిళలకు ఆన్​లైన్​లోనే ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ మహిళా భద్రత విభాగం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. వారిలో మానసిక కుంగుబాటును దూరం చేసేందుకు నిపుణులతో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకోసం 12 మంది నిపుణుల్ని అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

author img

By

Published : Apr 26, 2020, 6:22 AM IST

domestic violation
లాక్​డౌన్​ వేళ గృహహింస బాధితురాళ్లకు అండగా..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహహింస బారిన పడుతున్న స్త్రీలకు రాష్ట్ర మహిళా భద్రత విభాగం పోలీసులు ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గృహహింస బాధితులు ఠాణాలకు వెళ్లేందుకు అనువైన పరిస్థితులు లేనందున ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు. లాక్​డౌన్ ప్రారంభించి నెల రోజులు పూర్తైంది. ఇప్పటి వరకు డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల్ని విశ్లేషించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత నిపుణులే బాధితురాళ్లతో నేరుగా ఫోన్​లో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారని అధికారులు తెలిపారు.

చిన్నచిన్న సమస్యలే..

లాక్‌డౌన్​తో అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇక్కడ తలెత్తే చిన్నచిన్న సమస్యలే గృహహింసకు దారి తీసుకున్నాయి. లాక్‌డౌన్​కు ముందు భార్యభర్తల్లో ఎవరో ఒక్కరు, లేదా ఇద్దరు కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఇద్దరూ ఇంట్లోనే ఉన్నందున అహం, అనుమానపు సమస్యలు ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇటీవలి కాలంలో డయల్​ 100కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.

ఇంటి నుంచి పని తెచ్చిన తిప్పలు..

నానక్ రాంగూడకు చెందిన విహహిత ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తుంది. కార్యనిర్వహణలో భాగంగా ఆమె తరచూ ఫోన్స్​, చాటింగ్ ద్వారా తోటి ఉద్యోగులతో సంప్రదింపులు జరపడం భర్తలో అనుమానాన్ని పెంచింది. ఈ విషయంలో తరచూ గొడవలు జరిగాయి. భర్తలో మార్పు రాకపోయే సరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సమస్య పరిష్కారం కాలేదు. కొన్ని రోజులు తను పట్టింటికి వెళ్తానని చెప్పగ్గా పోలీసులే ఆమెను తమ వాహనంలో దింపేశారు.

మతం మార్చుకోని మనువాడిన ప్రేమ.. కానీ..

వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమ విహవాం చేసుకున్నారు. అతని కోసం ఆమె మతాన్నీ మార్చుకుని కూకట్​పల్లిలో కాపురం పెట్టారు. యువతి బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు. ఇంటి పని చేసే విషయంలో తాత్సారం చేస్తున్నావంటూ భర్త, అత్తామామలు తరచూ వేధించసాగారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షీ బృందం ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించింది. అతడి కోసం తల్లిదండ్రుల్ని వదిలి రావడం... మతాన్ని మార్చుకోవడం లాంటి అంశాల గురించి చెప్పగా అత్తింటి వారి మనసు మారి అంతా కలిసిపోయారు.

రోజుకు 400 వరకు..

రాష్ట్ర వ్యాప్తంగా గృహహింస ఉదంతాలపై రోజుకు 200 నుంచి 400 వరకు ఫిర్యాదులు అందుతున్నట్లు గుణాంకాలు చెబుతున్నాయి. లాక్​డౌన్ నేపథ్యంలో గత నెల 23 నుంచి శనివారం నాటికి ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 659 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిల్లో ఇంటి పనిలో మనస్పర్థలు 184 ఉన్నాయి.

ఇవీ చూడండి: పరిమళించిన మానవత్వం... హిందూ మహిళకు ముస్లిం అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.