ETV Bharat / city

సైబర్‌ నేరాలపై ఏకీకృత విధానం - తెలంగాణలో సైబర్​ నేరాల నియంత్రణ

సైబర్​ నేరాల బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్​ శాఖ కసరత్తు చేస్తోంది. నేరాలకు అడ్డుకట్ట వేసి.. నిందితులను పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది.

telangana police
సైబర్‌ నేరాలపై ఏకీకృత విధానం
author img

By

Published : Jun 10, 2020, 10:20 AM IST

రాష్ట్రంలో సైబర్‌ నేరాలు నానాటికీ పెరిగి పోతున్నాయి. ఈఏడాదిలో ఇప్పటి వరకు ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే రూ.20 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్ల మేర సైబర్‌ నేరగాళ్లు దోచేశారు. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయడంపై పోలీసుశాఖ దృష్టి సారించింది. మాయమాటలతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కొల్లగొడుతున్న ముఠాలను గుర్తించి పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది.

మాట కలిపితే.. ఖాతా ఖాళీ

‘'నో యువర్‌ కస్టమర్‌'’ పేరిట బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ ఖాతాదారులకు ఫోన్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. క్షణాల్లో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడాన్ని ఆసరాగా చేసుకుని మరింత రెచ్చిపోతున్నారు. ఝార్ఖండ్‌లోని జాంతారా కేంద్రంగా, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇలాంటి ముఠాలు పనిచేస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నేరాలు ఎక్కువగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ కేంద్రంగా జరుగుతున్నట్టు గుర్తించారు.

ఇప్పుడు విడివిడిగా.. ఇకపై సమష్టిగా

ఈ తరహా నేరాలపై ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ల వారీగానే కేసులను దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఒకే ముఠాను పట్టుకునేందుకు అనేక మంది పనిచేస్తున్నారన్న మాట. అలా కాకుండా దర్యాప్తును ఏకీకృతం చేస్తే పనిభారం తగ్గడంతోపాటు కేసును త్వరితగతిన పరిష్కరించే వీలుంటుందని, బాధితులకు త్వరగా న్యాయం చేయవచ్చని అధికారులు యోచిస్తున్నారు. ‘ఈ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఒకరి పర్యవేక్షణలో సమన్వయ పరుస్తారు. ఇతర రాష్ట్రాల్లో దాక్కున్న నిందితులను పట్టుకునేందుకు ఒకే బృందాన్ని పంపుతారు. కేసులన్నింటినీ కలిపి విచారిస్తారు. దీనివల్ల దర్యాప్తు త్వరగా పూర్తవుతుంది. నిందితులకు వెంటనే బెయిలు రాకుండా చేయడంతోపాటు కఠిన శిక్షలు పడేలా చూడవచ్చు. అన్నింటినీ మించి ఒకే ముఠా కోసం వేర్వేరు పోలీసు బృందాలు వెళ్లకుండా చూడటం ద్వారా మానవ వనరులను పొదుపుగా వాడుకోవచ్చనేది అధికారుల ఆలోచన’ అని పోలీస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవీచూడండి: రిహద్దుల్లో మావోయిస్టుల అలజడి.. పోలీసుల గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.