ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 3PM - 3PM టాప్​న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 15, 2022, 2:59 PM IST

  • అవినీతి, కుటుంబ పాలనను ఏరిపారేయాలి

స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ ఆత్మనిర్భర్ భారతావని లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శతాబ్ది వేడుకలు జరుపుకునే నాటికి స్వయంసమృద్ధ దేశంగా అవతరించాల్సిందనేని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చిచెప్పారు.

  • సంక్షేమ పథకాలు ఉచితాలంటూ కేంద్రం అపహాస్యం చేస్తోందన్న కేసీఆర్

విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న వారి కుట్రలను సమర్ధంగా తిప్పికొట్టేందుకు మేధావులు, యువత సహా అన్నివర్గాలు కదలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అన్నిరకాలుగా అభివృద్ధిలో దూస్తుకెళ్తున్న రాష్ట్రాన్ని.. ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు సరికాదంటూ ఆక్షేపించారు.

  • ఆత్మనిర్భర్‌ భారత్ వైపు పురోగమిద్దామన్న వెంకయ్యనాయుడు

స్వాతంత్ర్య అమృతోత్సవాల పేరిట నాటి స్వరాజ్య సమరయోధుల త్యాగాలు స్మరించుకుంటూ.. వేడుకలు జరుపుకోవడం ముదావహమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.

  • జెండాకు సెల్యూట్ చేస్తూ మాజీ జవాన్ మృతి

స్వాతంత్ర్య దినోత్సవం వేళ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూనే ప్రాణాలు విడిచారు ఓ మాజీ సైనికుడు. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా కడబ మండలం కుట్రుపడి గ్రామంలో సోమవారం జరిగిందీ ఘటన. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు మాజీ జవాన్ గంగాధర గౌడ హాజరయ్యారు.

  • బండి సంజయ్‌ పాదయాత్రలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ

బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరుప్పులలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జనగామ జిల్లాలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. దాడిలో పలువురు భాజపా కార్యకర్తలకు గాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు.

  • హత్యకు గురైన తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు

ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు కృష్ణయ్యను దుండగులు దారుణంగా హత్యచేశారు. బైకుపై ఇంటికి వెళ్తుండగా ఆరుగురు వ్యక్తులు ఆటోతో ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.

  • 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్‌ దర్శనం, ఏపీ మంత్రిపై విమర్శలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏపీ మంత్రి ఉష శ్రీచరణ్‌ అనుచరులు హంగామా సృష్టించారు. 50 మంది అనుచరులతో మంత్రి శ్రీవారి బ్రేక్‌ దర్శనానికి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్లు ఇటీవల తితిదే అధికారులు ప్రకటించారు.

  • కోహినూర్‌ సహా ఆంగ్లేయులు కొల్లగొట్టినవెన్నో

ఆంగ్లేయులు మన విలువైన సంపదను దోచుకెళ్లారనగానే చాలామందికి గుర్తుకొచ్చేది.. బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్‌ వజ్రమే. కానీ భారత్‌ను 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్‌ వారు అంతకన్నా ఎన్నో రెట్ల విలువైన అపూర్వ కళాఖండాలు, సౌందర్య శిల్పాలు, వెలకట్టలేని వస్తు సంపదను కొల్లగొట్టుకుపోయారు.

  • ధోనీ విషయంలో బీసీసీఐ నిర్ణయంపై ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అసహనం

విదేశీ లీగ్స్‌లో భారత ఆటగాళ్లను అనుమతించకపోవడం సరైన నిర్ణయం కాదని ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. ఇలా చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయేది ఉంటుందని అంటున్నాయి.

  • ప్రభాస్​ సలార్ రిలీజ్​ డేట్​ ఫిక్స్​, ఫుల్​ జోష్​లో ఫ్యాన్స్​

ప్రభాస్​ నటిస్తున్న 'సలార్'​ రిలీజ్​ డేట్ ఖరారైపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్పెషల్‌ పోస్టర్‌ షేర్‌ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.