ETV Bharat / city

KTR About Hyderabad Nalas : 'ఆ సమయంలో కేంద్రం పైసా ఇవ్వలేదు'

KTR About Hyderabad Nalas : హైదరాబాద్ వరదల్లో చిక్కుకున్నప్పుడు కేంద్ర పెద్దలు పర్యటించి సానుభూతి తెలిపారు కానీ పైసా ఇవ్వలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ సమయంలో వరదలతో నగర వాసులు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. వచ్చే వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా నాలాల పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

KTR About Hyderabad Nalas
KTR About Hyderabad Nalas
author img

By

Published : Mar 12, 2022, 12:15 PM IST

Updated : Mar 12, 2022, 10:01 PM IST

'కేంద్రం సాయం చేయదు.. పనిచేసే వారిని అడ్డుకుంటుంది'

KTR About Hyderabad Nalas : వర్షాకాలం వచ్చేలోపు నాలాల పనులు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో నాలాల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. భాగ్యనగరంలో జలదిగ్బంధం అయినప్పుడు కేంద్ర మంత్రులు వచ్చి చూశారని.. కాని అరపైసా కూడా సాయం చేయలేదని మండిపడ్డారు. గుజరాత్‌కు మాత్రం మోదీ వేయి కోట్ల సాయాన్ని ప్రకటించారని విమర్శించారు.

కోటి మందికి రూ.300 కోట్లు ఏం సరిపోతాయి..

KTR About Central's Negligence Towards Telangana : "హైదరాబాద్‌కు సాయమడిగితే కేంద్రం పెద్దలు అమృత్‌లో చేరమన్నారు. లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలు అమృత్‌లో చేరాలన్నారు. నగరంలో కోటికి పైగా జనం నివసిస్తున్నారు. కేంద్రమిచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? కంటోన్మెంట్‌లోని మిలటరీ ప్రాంతాల్లో కేంద్రం తీరు సరిగా లేదు. ఎన్ని సార్లు చెప్పినా కేంద్రం వినిపించుకోవడం లేదు. కంటోన్మెంట్‌లో అడ్డంగా రోడ్డు నిర్మించారు. దేశంలో తెలంగాణ భాగం కానట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. విద్యుత్‌, నీటి సరఫరా బంద్‌ చేసి కఠినంగా వ్యవహరిస్తాం. కేంద్రం సాయం చేయదు.. పనిచేసే వారికి మాత్రం అడ్డంకులు సృష్టిస్తుంది."

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

విశ్వనగరం దిశగా వడివడిగా..

KTR About Hyderabad Sewerage : హైదరాబాద్‌లో మురికినీరు, మంచినీరు కలవకుండా పక్కాగా చర్యలు చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో రూ.3,866 కోట్లతో వంద శాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. 2వేల ఎంఎల్‌డీల మురుగునీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని ఏర్పరుచుకున్న నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

పక్కా ప్రణాళికతో చర్యలు..

KTR About Hyderabad Floods : "ఈ వర్షాకాలంలో భాగ్యనగరానికి భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో నగర వాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి ఎప్పటికప్పుడు సాయం చేయడానికి మేం చాలా కృషి చేశాం. వరద ప్రాంతాలను చాలా మంది కేంద్ర మంత్రులు, పెద్దలు పర్యటించారు. కానీ పైసా సాయం కూడా చేయలేదు. గుజరాత్‌కు మాత్రం రూ.వెయ్యి కోట్ల సాయాన్ని ప్రకటించారు ప్రధాని మోదీ. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకు ఇంత చిన్నచూపు. కాంగ్రెస్ హయాంలో కలుషిత నీటితో భోలక్‌పూర్‌లో 11 మంది మృతిచెందారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. మురికి నీరు, మంచినీరు కలవకుండా పక్కాగా ప్రణాళికలు రూపొందించింది. ఆ దిశగా పనులు కూడా సాగుతున్నాయి."

Last Updated : Mar 12, 2022, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.