ప్రధాని మోదీతో తెలంగాణ భాజపా ఎంపీలు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ గరికపాటి మోహనరావు, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ ప్రధానితో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించే అవకాశం ఉంది. పెండింగ్ నిధులు, పార్టీకి సంబంధించిన అంశాలపై మోదీతో చర్చించనున్నారు.
ఇవీచూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర