Ministers and MPs Delhi Tour: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు తెరాస ప్రతినిధుల బృందం దిల్లీకి చేరుకుంది. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం హస్తికను చేరింది. రైతుల ప్రయోజనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో దిల్లీ వెళ్లిన మంత్రుల బృందం... రేపు, ఎల్లుండి కేంద్రమంత్రి, ప్రధానమంత్రితో భేటీకి యత్నాలు చేస్తున్నారు.
minister niranjan reddy comments: వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అదనపు ధాన్యం కొనుగోలుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆమోదం తెలపలేని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం ఆక్షేపించారు. ఈ ఏడాది యాసంగి వరి ధాన్యం విషయంలో రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ పార్లమెంటు సాక్షిగా తప్పుడు ప్రకటనలతో కేంద్రం ద్వంద విధానాలు అవలంభిస్తోందని తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల గురించి పట్టుబట్టకుండా కేంద్రం చెప్పినట్లు భాజపా ఎంపీలు, నేతలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో యాసంగిలో పండే వడ్లు బాయిల్డ్ రైస్‌కు మాత్రమే పనికొస్తాయని... ఈ విషయం తెలిసినా రైతుల ప్రయోజనాల కన్నా రాష్ట్ర భాజపా నేతలు రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆశిస్తుస్తున్నాయని ఆరోపించారు. భాజపా నేతల అసమర్ధత, కేంద్రం సవతి ప్రేమతో తెలంగాణ రైతాంగం సతమతమవుతోందని విమర్శించారు.
ఇదీ చూడండి: