తెలంగాణ వ్యాప్తంగా వివిధ బోధనాస్పత్రుల్లో మొత్తం 90 మంది అనధికార సెలవుల్లో ఉన్నట్లు గుర్తించిన వైద్య విద్యా సంచాలకులు వారిపై వేటు వేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఉస్మానియా, గాంధీ , రిమ్స్ , నీలోఫర్, కేఎంసీ వరంగల్, హన్మకొండ జీహెచ్ఎం, నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాల, సహా పలు బోధనాస్పత్రులకు చెందిన 27మందికి షోకాజు నోటీసులు జారీ చేశారు. వీరిలో పలువురు సుమారు నాలుగేళ్లుగా విధులు హాజరుకాకపోతుండటం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ బోధనాస్పత్రుల్లో కలిపి సుమారు 90 మంది అనధికార సెలవుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో భాగంగా తొలిదశలో 27 మందికి షోకాజు నోటీసులు ఇవ్వగా మిగతా వారికి మరో రెండు రోజుల్లో నోటీసులు ఇస్తామని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి స్ఫష్టం చేశారు. త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఇలాంటి వారిని గుర్తించి... సరైన వివరణ ఇవ్వని వారిని విధుల నుంచి తొలగించి కొత్త వారిని తీసుకోవాలని భావిస్తున్నారు.
- ఇదీ చూడండి : బహుముఖ ప్రజ్ఞాశాలి అభినవ్... అనుకుంటే సాధిస్తాడు!