రాష్ట్రంలో కొత్తగా 318 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,59,007 మంది కరోనా బారిన పడ్డారు. 389 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,49,391 మందికి చేరింది. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు 3,880 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పెరిగిన పాజిటివిటీ రేటు
గడిచిన 24 గంటల్లో 71,829 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 1,420 మంది రిపోర్ట్స్ రావల్సి ఉంది. ఇప్పటివరకు 2,48,48,181 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. 24 జిల్లాలో పదిలోపే కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 82 మందికి వైరస్ సోకింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు
తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 14, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 4, జోగులాంబ గద్వాల 1, కామారెడ్డి 2, కరీంనగర్ 23, ఖమ్మం 16, కొమురంభీం ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 6, మంచిర్యాల 8, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 19, ములుగు 2, నాగర్‌కర్నూల్ 1, నల్గొండ 15, నారాయణపేట 2, నిర్మల్ 1, నిజామాబాద్ 2, పెద్దపల్లి 13, రాజన్న సిరిసిల్ల 7, రంగారెడ్డి 16, సంగారెడ్డి 4, సిద్దిపేట 6, సూర్యాపేట 9, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ 9, హనుమకొండ 22, యాదాద్రి భువనగిరి 7 చొప్పున నమోదయ్యాయి.
ఇదీ చదవండి : డ్రగ్స్ కేసులో రకుల్‌ప్రీత్ సింగ్‌ను 6గంటల పాటు ప్రశ్నించిన ఈడీ