ETV Bharat / city

సెప్టెంబర్‌17 ను పురస్కరించుకుని జెండా ఆవిష్కరించిన నేతలు

సెప్టెంబర్‌ 17ను రాష్ట్రంలోని ఆయా పార్టీలు విమోచన, విలీన దినోత్సవంగా జరుపుకున్నాయి. కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసిన నేతలు అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా డిమాండ్‌ చేసింది. తెరాస, కాంగ్రెస్‌లు మాత్రం విలీన దినోత్సవంగా జరుపుకున్నాయి.

telangana-liberation-day
telangana-liberation-day
author img

By

Published : Sep 17, 2020, 3:54 PM IST

తెరాస ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ జాతీయజెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయ ఆవరణలోని తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు తెరాస నేతలు పూల మాలలు వేసి జోహార్లు అర్పించారు.

వారివి మత రాజకీయాలు

సెప్టెంబర్17కు భాజపా, ఎంఐఎంకి సంబంధంలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ విషయంలో రెండుపార్టీలు మత రాజకీయాలు చేస్తున్నాయని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్​లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అధికారికంగా జరపాలి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. దిల్లీలోని ఆయన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని లక్ష్మణ్ ఎగురవేశారు. ఎంఐఎం ఒత్తిళ్లు తలొగ్గే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి భయపడుతోందని భాజపా నేతలు ఆరోపించారు.

చరిత్రను వక్రీకరించొద్దు

తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణులు సెప్టెంబర్‌ 17ను జరుపుకున్నాయి. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుల త్యాగాలను నేతలు స్మరించుకున్నారు. తెరాస ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అనుసరిస్తోందని ఎల్‌.రమణ దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్‌లో చాడ వెంకట్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. పాలకులు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే.. కాలగర్భంలో కలిసిపోతారని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లాల్లోనూ ఆయా పార్టీల శ్రేణులు సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని కార్యాలయాల్లో జాతీయజెండా ఎగురవేశాయి.

ఇదీ చదవండి: ఎన్నిరోజులైనా లక్ష ఇళ్లను పరిశీలిస్తాం: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.