FRBM amendment bill Approved : ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపుపై చట్టసవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి ఈ ఏడాది 4, వచ్చే ఏడాది 5 శాతం పెంపునకు ఆమోదముద్ర వేసింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్య పెంపు బిల్లుకు మండలి పచ్చజెండా ఊపింది. సభ్యుల సంఖ్య 8 నుంచి 12కు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. మార్కెట్ కమిటీ సభ్యుల పదవీ కాలం పెంపు బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఇకనుంచి సభ్యుల పదవీ కాలం ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుకునే అవకాశం కలగనుంది.
"రైతుల ప్రాతినిథ్యాన్ని పెంచేందుకు ఈ బిల్లు ఎంతో దోహదపడుతుంది. ఒకే అధికార వర్గం పరిధిలో ఉన్న భిన్న వర్గాలకు చెందిన రైతులకు ప్రాతినిథ్య అవకాశం కల్పించే ఉద్దేశంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో కర్షకుల అభివృద్ధికి బాటలు పడుతున్న నేపథ్యంలో అన్నదాతల ప్రగతి మరింత దూసుకెళ్లడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి దీన్ని ఆమోదించాలని కోరుతున్నాను."
- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి