జూనియర్ వైద్యుల సమ్మె విరమణపై సందిగ్ధత తొలగలేదు. బీఆర్‌కే భవన్‌లో జూడాలతో రాష్ట్ర విద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ చర్చించారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకున్న జూడాలకు స్పష్టమైన హామీ లభించలేదని జూడాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ లిఖితపూర్వక హామీ ఇవ్వలేదని జూనియర్ వైద్యులు తెలిపారు.
"కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఉత్తర్వుల జారీకి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. అత్యవసర సేవలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎక్స్గ్రేషియా విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచించమన్నారు."- జూడాలు
సమ్మె విరమణపై సాయంత్రం అందరితో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామని జూడాలు తెలిపారు.