KTR Helped A Youngman : వరంగల్‌లో విషమ పరిస్థితుల్లో ఉన్న తల్లిని చూసేందుకు వీలుగా స్వదేశానికి పయనమయ్యేందుకు అమెరికాలో ఉన్న మాదాడి వినయ్‌రెడ్డికి అత్యవసర వీసా మంజూరైంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి మేరకు అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం ఈ వీసాను ఇప్పించింది. తన తల్లి వరంగల్‌లో చావుబతుకుల మధ్య ఉందని, ఒక్కగానొక్క కొడుకైన తన కోసం తపిస్తోందని, అమెరికాలో ఈ-వీసాలను రద్దు చేసినందున తనకు వరంగల్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని వినయ్ మంత్రిని గురువారం ట్విటర్‌లో కోరారు.
KTR Helped A Youngman to Get Visa : ఈ మేరకు మంత్రి స్పందించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ట్విటర్ ద్వారా అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. కేటీఆర్ వినతి మేరకు రాయబార కార్యాలయ అధికారులు అత్యవసర వీసా జారీ చేశారు. వినయ్ శుక్రవారం ఉదయమే హైదరాబాద్‌కు బయల్దేరారు.
- సంబంధిత కథనాలు : KTR Tweet to Central Minister : 'ఆ తల్లి పరిస్థితి విషమంగా ఉంది'.. కేంద్ర మంత్రికి కేటీఆర్ ట్వీట్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!