TS Inter memos: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థుందరికీ కనీస మార్కులు వేస్తూ మెమోలు సవరించారు. పాస్ మెమోలను ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని కార్యదర్శి సయ్యద్ ఉమర్జలీల్ తెలిపారు. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. వాటిని రద్దుచేసుకొని ఫీజు వెనక్కి తీసుకోవచ్చునని ఇంటర్ బోర్డు తెలిపింది. సాయంత్రం 5 నుంచి ఈనెల 17 సాయంత్రం 5 వరకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు రద్దు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులు వెనక్కి తీసుకున్న విద్యార్థులకు.. ఫిబ్రవరి 1 నుంచి వారు చదువుతున్న కాలేజీల్లో నగదు తీసుకోవాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు చెల్లించాల్సిన వార్షిక పరీక్షల ఫీజుల వివరాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 490 రూపాయలు చెల్లించాలని బోర్డు పేర్కొంది. రెండో సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులు 490 రూపాయలు, సైన్స్ విద్యార్థులు రూ.690, మొదటి, రెండో సంవత్సరం బ్యాక్లాగ్ పరీక్షల కోసం 490 రూపాయలు, ఇంప్రూవ్మెంట్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 490 రూపాయలతో పాటు అదనంగా 150 రూపాయలు చెల్లించాలని తెలిపింది. నిర్ణీత ఫీజు కన్నా ఎక్కువ తీసుకునే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ హెచ్చరించారు.
ఇదీచూడండి: Inter first year results: ఇంటర్ ఫస్టియర్ ఫెయిలయిన విద్యార్థులకు గుడ్న్యూస్