ETV Bharat / city

ప్రతిరోజు 20 మంది ముస్లింలకు భోజనం పెట్టాలి : హైకోర్టు - High Court hearing on excise officer Qureshi petition

ముస్లింలకు భోజనాలు పెట్టాలన్న షరతుతో ఆబ్కారీ అధికారి యాసిన్ ఖురేషీపై కోర్టు ధిక్కరణ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనందున మహబూబ్​నగర్ జిల్లా ఆబ్కారీ ఉపకమిషనర్ ఖురేషీకి గతంలో.. సింగిల్ జడ్జి వేయి రూపాయల జరిమానా విధించారు.

telangana high court, high court updates, excise officer qureshi case
తెలంగాణ హైకోర్టు, హైకోర్టు వార్తలు, ఆబ్కారీ అధికారి ఖురేషీ కేసు విచారణ
author img

By

Published : Apr 16, 2021, 7:22 PM IST

కోర్టు ఆదేశాలు అమలు చేయనందున మహబూబ్​నగర్ జిల్లా ఆబ్కారీ ఉపకమిషనర్ యాసిన్ ఖురేషీకి సింగిల్ జడ్జి గతంలో వేయి రూపాయల జరిమానా విధించారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలు ఉల్లంఘించలేదని.. సింగిల్ జడ్జి విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఖురేషీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్​సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

వేయి రూపాయలు జరిమానా విధిస్తే.. తన వృత్తిపరమైన జీవితంలో అది మచ్చగా ఉంటుందని, ఆ శిక్షను రద్దు చేయాలని ఖురేషీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అతని వాదన విన్న ధర్మాసనం.. రంజాన్ మాసం ప్రారంభమైన దృష్ట్యా ఏదైనా మసీదు వద్ద ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత.. ప్రతిరోజు 20 మంది ముస్లింలకు భోజనాలు పెట్టాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి విధించిన శిక్షను రద్దు చేస్తూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు భోజనాలు పెడతారని విశ్వసిస్తున్నామని.. తాము పర్యవేక్షించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.