కోర్టులు తెరిచాక 111జీవో వివాదంపై సీరియస్‌గా విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. ట్రిపుల్ వన్ జీవోకు సంబంధించి సుమారు వందకుపైగా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం తెలిపింది.
జీవో నంబర్111కి విరుద్ధంగా శంషాబాద్‌లో అగర్వాల్ అనే వ్యక్తి భవనం నిర్మిస్తున్నారని ధర్మారావు అనే వ్యాపారి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. 111జీవో పరిధిలో శంషాబాద్ విమానాశ్రయం సహా అనేక నిర్మాణాలుండగా.. ఆ ఒక్క నిర్మాణంపైనే పిల్ వేయడమేంటని జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వినియోగించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
- ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'