రాష్ట్రంలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లలో ఖాళీలను భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లోని ఆరు వైద్య కళాశాలల్లోని ల్యాబ్‌లు సహా కరీంనగర్ జిల్లా ఆస్పత్రి ల్యాబ్‌లో పనిచేసేందుకు గాను 84 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.
కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. ఆరు నెలల కాలానికి కాంట్రాక్టు ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సైంటిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేయనుంది.
ఆదిలాబాద్ రిమ్స్‌లో ముగ్గురు సైంటిస్ట్‌లు, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ మెడకల్ కళాశాలు, కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో మూడేసి చొప్పున సైంటిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా ఆస్పత్రుల్లో ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్, మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులనూ నియమించనుంది. థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఇవీచూడండి: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌కు వాలంటీర్ల ఉత్సాహం