అవసరమైన వారికి సరైన సమాచారం ఇవ్వకపోతే.. 104 హెల్ప్ లైన్ ఉండి ఏం ప్రయోజనమని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలకు అవసరమైన సమాచారం విసుక్కోకుండా వివరించే సిబ్బంది హెల్ప్ లైన్లో ఉండాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
కరోనా హెల్ప్ లైన్ నంబరు సరిగా పనిచేయడం లేదని.. అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతూ న్యాయవాది స్మృతి జైశ్వాల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అర్ ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
వీలైతే ఒకటి కన్న ఎక్కువ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది.