ETV Bharat / city

ఐసొలేషన్‌ వైద్యానికి ప్రత్యేక యాప్‌.. వైద్యులతో ఆన్‌లైన్‌ సేవలు - తెలంగాణ కరోనా వార్తలు

కొవిడ్‌ బారినపడి ఇంటి వద్దనే(ఐసొలేషన్‌) చికిత్స పొందుతున్న బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హితం(హోం ఐసొలేషన్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌)’ పేరిట కొత్త యాప్‌ను రూపొందించింది. బాధితుల ఆరోగ్య శ్రేయస్సును కాంక్షిస్తూ యాప్‌నకు ఈ పేరు పెట్టినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పరిశీలన ప్రారంభమైందని.. లోపాలు, లోటుపాట్లను సరిచేసి, త్వరలోనే అధికారికంగా అమల్లోకి తెస్తామని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

coronavirus
coronavirus
author img

By

Published : Jul 21, 2020, 7:21 AM IST

ఏమిటీ ‘హితం’?

  • కరోనా వైరస్‌ బారినపడిన వారిలో దాదాపు 85 శాతానికి పైగా బాధితుల్లో ఎటువంటి లక్షణాలు ఉండడం లేదు. ఇంటి వద్దనే విడి గదిలో(ఐసొలేషన్‌)లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అటువంటి వారు రాష్ట్రంలో ప్రస్తుతం 12వేల మందికి పైగానే ఉన్నారు.
  • ఇంట్లో చికిత్స పొందుతున్నవారికి 12 రకాల మందులు, శానిటైజర్‌, మాస్కులతో కూడిన ‘హోం ఐసొలేషన్‌ మెడికల్‌ కిట్‌’ను ప్రభుత్వం రూపొందించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొన్నిచోట్ల వీటిని సరఫరా చేస్తుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలోనూ ఈ కిట్లను అందించడానికి లక్ష కిట్లు తయారు చేయాలని నిర్ణయించింది. కిట్‌ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా.. ప్రభుత్వ వైద్యసిబ్బంది పర్యవేక్షణలోనే సిద్ధం చేస్తారు. ఇందుకోసం ఔషధాల కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.
  • ఔషధాలు అందుబాటులో ఉన్నా.. వైద్యుల సలహాలకు నోచుకోవడం లేదనే వెలితి ఎక్కువ మంది బాధితుల్లో ఉంది.దీన్ని దృష్టిలో ఉంచుకొనే ‘హితం’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
  • ఒకే సమయంలో 10వేల మందికి పైగా కూడా ఆన్‌లైన్‌లో సేవలందించే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యాప్‌ను రూపొందించారు.

సేవలెలా?

  • హోంఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి మొబైల్‌లోనూ ‘హితం’ యాప్‌ను వైద్యసిబ్బంది డౌన్‌లోడ్‌ చేయిస్తారు. దీంతో ప్రతి ఒక్కరి సమాచారం వైద్యశాఖ వద్ద ఉంటుంది. ఈ సమాచారం ప్రాతిపదికన వైద్యులు ఆన్‌లైన్‌లో బాధితులతో రోజూ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు.
  • స్వల్పంగా లక్షణాలుంటే ఏమి చేయాలి? ఎప్పుడు పరిస్థితి తీవ్రమైనదని అనుమానించాలి? తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు.
  • చేతుల పరిశుభ్రత, మాస్కులు ధరించే విధానం,గదిని శుభ్రం చేసుకోవడం తదితర విషయాలపై అవగాహన పెంపొందిస్తారు.
  • అలా 10 రోజుల పాటు రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఫోన్‌ ద్వారా వైద్యులు ఆరోగ్య సమాచారాన్ని ఆరా తీస్తారు.
  • తర్వాత వచ్చే ఏడు రోజుల పాటు బాధితులు స్వీయ పర్యవేక్షణలో ఇళ్ల వద్దే ఉండాలి. ఆ సమయంలో కూడా వారికి ఎటువంటి సమస్య ఎదురైనా యాప్‌ ద్వారా వైద్యులను సంప్రదించవచ్చు.
  • ఇందుకోసం విశ్రాంత, నిరుద్యోగ వైద్యులను ఆరోగ్యశాఖ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేస్తోంది.
  • ఇంట్లో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించితే.. ఈ యాప్‌ ద్వారా 108కి కాల్‌ చేసే విధంగా కూడా అనుసంధానించారు.

రోజుకు 25వేల పరీక్షలు

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించడానికి ఇప్పటికే 2 లక్షల యాంటీజెన్‌ కిట్లను కొనుగోలు చేయగా.. వీటిల్లో లక్ష కిట్ల వరకూ వినియోగించినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి.

జిల్లాల్లో గ్రామీణ స్థాయిలోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయుల్లోనూ కరోనా కిట్లను సరఫరా చేస్తోంది. వచ్చే నెల రోజుల్లో దాదాపు 5 లక్షల యాంటీజెన్‌ కిట్లను కొనుగోలు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

తక్షణమే 2 లక్షల కిట్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం రోజుకు సుమారు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో రోజుకు 25వేల యాంటీజెన్‌ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా బాధితులను త్వరగా గుర్తించి, విడిగా చికిత్స అందించడానికి వీలుంటుందని, తద్వారా వైరస్‌ వ్యాప్తిని కూడా అడ్డుకోవచ్చని పేర్కొన్నాయి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేసి, హోం ఐసొలేషన్‌లో ఉండగలిగే వారిని వారిళ్ల వద్దనే ఉంచుతారు. అటువంటి వసతులు లేని వారిని ఆయా జిల్లాల్లోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తారు. లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తారు.

ఇదీ చదవండి: భారత్ బయో 'కొవాక్జిన్' పరీక్షలు వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.