ETV Bharat / city

పదో తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇలా ఇస్తారు... - పదో తరగతి పరీక్షలపై కేసీఆర్​ నిర్ణయం

కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రాతిపదికన 20 మార్కులకు హిందీలో 4, మిగతా సబ్జెక్టుల్లో 7 వస్తే విద్యార్థులను పై తరగతులకు అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల 35 వేల మంది విద్యార్థులు ఉండగా.. ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది.

ర్కుల ఆధారంగా పైతరగతికి ప్రమోట్​
ర్కుల ఆధారంగా పైతరగతికి ప్రమోట్​
author img

By

Published : Jun 9, 2020, 5:50 AM IST

Updated : Jun 9, 2020, 6:28 AM IST

పదో తరగతి పరీక్షల్లో ఈ సారి ఎక్కువ మంది విద్యార్థులకు ఎ1 గ్రేడ్‌ దక్కే అవకాశం ఉంది. దీనికి ప్రధానం కారణం పాఠశాల స్థాయిలో నిర్వహించే ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల్లో కనీస మార్కులు సాధించని వారు అత్యంత అరుదుగా ఉండటమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష రాసిన విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారని అంటున్నారు. పాఠశాలలు నిర్వహించే నాలుగు పరీక్షలను రాయకుంటే తప్ప ఫెయిల్‌ అయ్యే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఉత్తీర్ణత సగటు 93 శాతం ఉండగా.. సప్లిమెంటరీలో పాసైన వారిని తీసుకుంటే 98కి పెరిగింది. ఈ సారి 100 శాతం ఉత్తీర్ణులయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ సారి వంద శాతం!

అంతర్గత పరీక్షలలో 20 మార్కులకు హిందీ 4 వస్తే పాసైనట్లే. హిందీలో వందకు 20 మార్కులు, మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తారు. ఎఫ్‌ఏ పరీక్షలు 20 మార్కులకు నిర్వహిస్తారు. అంటే అప్పుడు హిందీలో4 మార్కులు వస్తే వందకి 20వస్తాయి. మిగిలిన సబ్జెక్టుల్లో 20కి 7 మార్కులు వస్తే.. అప్పుడు 35 మార్కులు దక్కుతాయి. ఆ మార్కులు వచ్చిన వారు ఉత్తీర్ణులైనట్లే. సాధారణంగా చదువులో ఎంతో వెనుకబడిన విద్యార్థికైనా కనీస మార్కులు వేస్తారు. వారికి 8 నుంచి 9 మార్కులు ఇస్తుంటారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆ మార్కులు కొంత ఎక్కువగా వేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎఫ్‌ఏ మార్కులను పరిగణలోకి తీసుకుంటే ఇక తప్పే వారే ఉండరు. ఆ ప్రకారం ఈ సారి వంద శాతం ఉత్తీర్ణత వచ్చినట్లే.. ఎఫ్‌ఏ పరీక్షలు రాయకుంటేనే వారు తప్పుతారు.

మార్కులు ఎలా పరిగణిస్తారంటే..

పదో తరగతిలో ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌లు నాలుగు నిర్వహిస్తారు. వాటిని ఎఫ్‌ఏ-1, 2, 3, 4గా పిలుస్తారు. ఇవి ప్రతి రెండు నెలలకు ఒకసారి జరపుతారు. ఒక్కో దానికి 30 నుంచి 42 రోజుల సిలబస్‌ను పరిగణలోకి తీసుకొని ఈ పరీక్షలు జరపుతారు. వాటిల్లో వచ్చిన మార్కులనే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఒక్కో పరీక్షను 20 మార్కులకు నిర్వహించి తదుపరి 5 మార్కులకు కుదిస్తారు. ఆ రాత పరీక్షతో పాటు ప్రాజెక్టు వర్క్‌కు 5 మార్కులు, నోట్‌బుక్‌కి మార్కులు ఉంటాయి. ఇంకా తరగతి గది స్పందనకు 5 మార్కులుంటాయి.. అలా 5+5+5+5 మొత్తం 20 మార్కులకు ఒక ఎఫ్‌ఏ నిర్వహిస్తారు. సంవత్సరంలో 4 ఎఫ్‌ఏలు నిర్వహిస్తారు అంటే 20+20+20+20=80 మార్కులు. వాటిని సరాసరి చేసి 20 మార్కులకు కుదిస్తారు. ఆ ప్రకారం ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులకు ఎన్ని వచ్చాయో లెక్కించి వాటిని ఫిబ్రవరిలో ప్రభుత్వ పరీక్షల విభాగానికి(ఎస్‌ఎస్‌సీ బోర్డు)కు ఆన్‌లైన్‌లో పంపిస్తారు.

మార్కులు వచ్చాయా? వేశారా?

ప్రతి విద్యార్థి కనీసం ఎన్ని ఎఫ్‌ఏలు రాయాలన్న నిబంధన లేకున్నా రెండు కంటే తక్కువ రాసే వారు చాలా అరుదు. అప్పుడు ఆ రెండింటి సగటు తీసుకుంటారు. అంతకు ముందే ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ముగ్గురి బృందం అన్ని ప్రైవేట్‌ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులను పరిశీలించి, యాజమాన్యాలు సక్రమంగానే అంతర్గత మార్కులు ఇచ్చాయా? లేదా ఇష్టమొచ్చినట్లు వేశారా? అనేది పరిశీలిస్తారు. అందుకే ఎఫ్‌ఏ పరీక్షల మార్కులనే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

ఒక్కో సబ్జెక్టుల్లో ఎఫ్‌ఏలో వచ్చిన మార్కులను(20కి) వందకి లెక్కిస్తారు. వాటిని ఇప్పుడు ఆ సబ్జెక్టుల్లో వచ్చిన మొత్తం మార్కులుగా పరిగణిస్తారు. తెలుగులో ఎఫ్‌ఏ పరీక్షల్లో 20కి 18మార్కులు వస్తే దాన్ని వందకి లెక్కిస్తారు. అంటే 18* 5=90 మార్కులు వచ్చినట్లుగా పరిగణిస్తారు.

Last Updated : Jun 9, 2020, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.