Governor Tamilisai : తమ సమస్యలు పరిష్కరించాలంటూ గవర్నర్ తమిళిసైని గత అయిదు రోజుల్లో 181 మంది అర్జీదారులు కోరారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 1న గవర్నర్ రాజ్‌భవన్ గేటు వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇందులో వచ్చిన అర్జీల్లో చాలా మంది భూసమస్యలు, సేవలు, ఆర్థిక సాయం, ఇళ్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర అంశాలపై విన్నవించారు. ఈ నెల 5వ తేదీ వరకు వచ్చిన వాటిని గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో గవర్నర్ సమీక్షించారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
Telangana Governor Tamilisai : కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, పరిపాలన సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.