Telangana Loan: రాష్ట్ర ప్రభుత్వం మరో 2000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోనుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 14 ఏళ్ల కాలపరిమితితో జారీ చేసిన బాండ్లను రిజర్వ్ బ్యాంకు ద్వారా ఈ నెల ఎనిమిదో తేదీన వేలం వేస్తారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 41వేల కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకుంది. తాజాగా నోటిఫికేషన్తో రుణాల మొత్తం 43 వేల కోట్ల రూపాయలను దాటనుంది.
ఇదీ చూడండి: