ETV Bharat / city

ఏళ్ల తరబడి ప్రాజెక్టుల పనులు... కాంట్రాక్టర్లపై వేటు - కొత్త గుత్తేదారుకు అప్పగించాలని నిర్ణయం

ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడంలో ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్న గుత్తేదారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఓ ప్యాకేజీ పనిని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ప్యాకేజీలో పని చేయకుండా నిలిపివేయాలని నోటీసులు జారీ చేసింది. ఇక్కడ కూడా పూర్తిగా రద్దు చేసి కొత్త గుత్తేదారుకు అప్పగించాలని నిర్ణయం తీసుకొన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అనేక ప్రాజెక్టుల్లో గడువు పొడిగించుకుపోతున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. పదేళ్లయినా నాలుగోవంతు కూడా పూర్తి కాకపోతుండటం, ఎన్ని నోటీసులిచ్చినా గుత్తేదారుల్లో మార్పు రాకపోవటంతో చర్యలకు ఉపక్రమించినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

telangana government started action on project contractors

author img

By

Published : Mar 14, 2021, 9:13 AM IST

రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తున్న గుత్తేదారులపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఉన్న గుత్తేదారుల పనిని పూర్తిగా రద్దు చేసి... కొత్త వారికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వార్గాల ద్వారా తెలిసింది. దేవాదుల ఎత్తిపోతల మూడో దశలో మూడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణం, 78 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులు దక్కించుకున్న గుత్తేదారు పదేళ్లయినా 25 శాతం పనులు కూడా చేయలేదు. దాంతో తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సంబంధిత ఎస్‌.ఇ గుత్తేదారును తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దేవాదుల మూడో దశ కింద నస్కల్‌, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణం, 78 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులకు రూ.325.20 కోట్లకు 2009 అక్టోబరు 28న క్రాంతి-ష్యూ జాయింట్‌ వెంచర్‌తో నీటిపారుదల శాఖ ఒప్పందం చేసుకొంది. అప్పటి నుంచి ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

2019 ఫిబ్రవరి ఏడున దేవాదులపై సమీక్షించిన ముఖ్యమంత్రి పదేళ్లలో 16 శాతం పనులు మాత్రమే జరగడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, పని చేయకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో నీటిపారుదల శాఖ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. నస్కల్‌ రిజర్వాయర్‌ పనిని ఈ గుత్తేదారు నుంచి తొలగించి మరో గుత్తేదారుకు అప్పగించింది. తర్వాత మిగిలిన పనుల గురించి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి దయాకర్‌రావు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమీక్షించి పనుల వేగం పెంచాలని గుత్తేదారును కోరినా ఫలితం లేకపోవడంతో పూర్తిగా తొలగించాలని నిర్ణయం తీసుకొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.రెండేళ్లుగా నోటీసులు ఇచ్చి, చర్చలు జరిపిన తర్వాత చర్య తీసుకోక తప్పలేదని పేర్కొన్నాయి. గుత్తేదారును పూర్తిగా తొలగిస్తూ గత నెలాఖరులో నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం సుమారు రూ.220 కోట్ల పని మిగిలి ఉందని, తాజా ధరలతో మళ్లీ అంచనాలు తయారు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. తాజా అంచనా విలువ సుమారు రూ.400 కోట్లకు చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.

పెండ్లిపాక రిజర్వాయర్‌ పని రద్దు

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నుంచి నీటిని నిల్వ చేసి కాలువలకు సరఫరా చేసేందుకు వీలుగా చేపట్టిన పెండ్లిపాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనిని కూడా గుత్తేదారు చేయకుండా నిలిపివేస్తూ నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. రూ.343 కోట్ల ఈ పనిని 27 శాతం తక్కువకు 2014లో క్రాంతి-సత్యసాయి-స్వప్న జాయింట్‌ వెంచర్‌ దక్కించుకొంది. ఉన్న చెరువును 2.2 టీఎంసీల సామర్థ్యానికి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్ల పని మాత్రమే జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడేళ్లు గడువు పొడిగించగా అది కూడా గత అక్టోబరుతో ముగిసింది. మళ్లీ గడువు పొడిగించడానికి సంబంధిత ఇంజినీర్లు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటివరకు సగం పని కూడా కాలేదని, ప్రస్తుత గుత్తేదారు సంస్థను తొలగించి కొత్త గుత్తేదారును ఎంపిక చేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతో సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు పని సస్పెన్షన్‌ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు గడువు తర్వాత రద్దు చేస్తూ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 33% పని జరిగినట్లు తెలిసింది. భూసేకరణ జరగకపోవడం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంవల్ల పనులు చేయలేకపోయామని గుత్తేదారు పేర్కొన్నట్లు తెలిసింది. మొత్తమ్మీద ప్రాజెక్టుల పనుల జాప్యంపైచర్యలకు ప్రభుత్వంశ్రీకారం చుట్టింది.

ఇదీ చూడండి: నల్లమల అడవుల్లో ఆందోళన కలిగిస్తున్న అగ్నిప్రమాదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.