ETV Bharat / city

Rabi crops in Telangana : 'యాసంగిలో వరి సాగు వద్దు' - no rice cultivation in rabi season in telangana

యాసంగి సీజన్(Rabi season 2021)​లో ఉప్పుడు బియ్యం తీసుకునే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో యాసంగి(Rabi season 2021)కి వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతోంది. వరికి బదులు పప్పు దినుసులు, వంటనూనెలకు ఉపకరించే పంటలు వేయాలని సూచిస్తోంది.

Rabi crops in Telangana
Rabi crops in Telangana
author img

By

Published : Oct 9, 2021, 6:48 AM IST

యాసంగి సీజను(Rabi season 2021)లో రైతులు వరి సాగు(Paddy cultivation) చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) రైతులను కోరుతోంది. యాసంగి(Rabi season 2021)లో వచ్చే ధాన్యంలో సింహభాగం ఉప్పుడు బియ్యానికే పనికొస్తాయి. గత యాసంగి(Rabi season 2021)కి సంబంధించి ఉప్పుడు బియ్యం తీసుకునే విషయంలో పెద్ద ప్రహసనం సాగుతున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో నీటి లభ్యతతోపాటు అదునులో వర్షాలు బాగా పడుతుండంతో వరి సాగు(Paddy cultivation) విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. గత యాసంగి(Rabi season 2021)లో అత్యధికంగా 54 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. 92 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దీని నుంచి 62 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. కానీ కేంద్రం కేవలం 24.75 లక్షల టన్నుల బియ్యం మాత్రమే తీసుకుంటామని ప్రకటించింది. పలు దఫాల చర్చలు, ముఖ్యమంత్రి జోక్యంతో మరో 20 లక్షల టన్నులు తీసుకునేందుకు అంగీకరించింది. వచ్చే సీజను(Rabi season 2021)లో ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో వరి సాగు(Paddy cultivation) చేయవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతోంది. యాసంగి సీజను అక్టోబరు నుంచి ప్రారంభమవుతుంది.

పప్పు దినుసులు... నూనె గింజలు మంచిది

యాసంగి(Rabi season 2021)లో వరి(Paddy cultivation)కి బదులు... కంది, వేరుసెనగ, నువ్వులు, పెసలు, మినుములు, ఆముదం ఇతర పప్పు దినుసులు, కూరగాయలు, వంట నూనెలకు ఉపకరించే పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ విషయంలో రైతులను చైతన్యవంతులను చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతు వేదికలే కేంద్రాలుగా వారికి అవగాహన కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.