ETV Bharat / city

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా టీకాలు - తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్​ వార్తలు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ టీకాలు వేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని 2 వేల కేంద్రాల్లో ఏప్రిల్‌ 1 నుంచి వ్యాక్సినేషన్‌ కొనసాగేలా సన్నాహాలు చేస్తున్నారు.

corona vaccination
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా టీకాలు
author img

By

Published : Mar 30, 2021, 5:59 AM IST

గ్రామీణ ప్రజలకు కొవిడ్‌ టీకాలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ వైద్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులను కలుపుకొని 500కి పైగా కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేస్తుండగా.. వీటి సంఖ్యను కనీసం 1000కి పెంచాలని నిర్ణయించింది.

వెయ్యికి పెంచేందుకు..

ఈ క్రమంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కొవిడ్‌ టీకాలను పంపిణీ చేయడానికి విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం 200కి పైగా కేంద్రాల్లో టీకాలను అందజేస్తుండగా.... వీటి సంఖ్యనూ వెయ్యికి పెంచేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను పంపిణీ చేయనుండడంతో.. అందుకనుగుణంగా రాష్ట్రంలో కనీసం 2వేల కేంద్రాల్లో కొవిడ్‌ టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

అధిక ధర వసూలు చేస్తే..

కొన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే టీకాలను వేస్తుండగా... ఏప్రిల్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో పీహెచ్​సీల్లో టీకాలను అందించనున్నారు. ఇందుకు అవసరమైన టీకాల మోతాదులను పీహెచ్‌సీల్లోని అతిశీతల యంత్రాల్లో భద్రపర్చారు. ప్రైవేటులో నిర్దేశించిన టీకా ధర రూ. 250 కంటే ఎక్కువగా వసూలు చేస్తే వెంటనే సమీపంలోని వైద్యాధికారికి ఫిర్యాదు చేయాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. దుష్ఫలితాలను ఎదుర్కొనేందుకు అన్ని కేంద్రాల్లోనూ ప్రత్యేక ఔషధ కిట్లను సమకూర్చామని, అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటులో 60కి పైగా ఆసుపత్రులను అత్యవసర చికిత్సకు ఎంపిక చేశామన్నారు.

రెండే మార్గాలు..

మరోవైపు రాష్ట్రంలో టీకా పంపిణీ ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు గడిచినా.. ఇప్పటికీ చాలామందిలో కొవిడ్‌ టీకాను ఎలా పొందాలనే అంశంపై స్పష్టత లేదు. ఇందుకు రెండే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. కొవిన్‌ యాప్‌ ద్వారా స్వీయ నమోదు చేసుకొని సమీపంలోని వైద్యశాలలో టీకాను పొందవచ్చు. రెండో విధానంలో దగ్గరలోని టీకా పంపిణీ కేంద్రానికి ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు లేదా ఏ తరహా గుర్తింపు కార్డు ఉన్నా నేరుగా వచ్చి టీకాను పొందవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేస్తోంది. టీకాలపై అపోహలు తొలగించేందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.

ఇవీచూడండి: 102 ఏళ్ల వయసులో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎడ్లపాటి వెంకట్రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.