రాష్ట్రంలో ఇకపై స్లాట్ బుకింగ్‌తో నిమిత్తం లేకుండా వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఆ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి.. అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీలు, డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు ఈ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలయ్యేట్లు చూడాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారిని.. స్లాట్ బుకింగ్ లేదన్న సాకుతో వెనక్కి పంపొద్దని ఆదేశించారు.
ఇవీచూడండి: ఈ బ్యాంక్‌ల ఏటీఎంలు ఎన్నిసార్లు వాడినా ఫ్రీ!