ETV Bharat / city

కరోనా సెకండ్​ వేవ్​​పై అప్రమత్తం.. కఠినంగా నిబంధనల అమలు - telangana corona news

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. పోలీసులు నిబంధనల అమలును కఠినతరం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలంటూ.. అవగాహన కల్పించడం సహా సామాజిక మాధ్యమాల ద్వారానూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.

mask awareness
కరోనా సెకండ్​ వేవ్​​పై అప్రమత్తం..
author img

By

Published : Mar 31, 2021, 6:55 AM IST

కరోనా సెకండ్​ వేవ్​​పై అప్రమత్తం..

రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతితో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... లేకుంటే విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అందుకోసం ఆయా విభాగాల అధికారులతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజలకు అవగాహన కల్పించడం సహా.. కేసులు నమోదు చేస్తున్నారు.

రోడ్లపై ప్లకార్డులతో అవగాహన

హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లో మాస్క్ ధరించని 17 మందిపై పోలీసులు కేసునమోదు చేశారు. ఎల్బీనగర్‌ కూడలి వద్ద.. మాస్క్‌ వినియోగించాలంటూ ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కల్పించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. తరచూ మాస్కులు లేకుండా తిరిగే వారిని గుర్తించి.. వారితో రోడ్లపై ఫ్లకార్డులు ప్రదర్శించి ప్రజలను చైతన్య పరిచారు.

కూడళ్లలో స్పెషల్ డ్రైవ్

కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ.. వరంగల్‌ ఎంజీఎం కూడలి వద్ద పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. మాస్కులు ధరించని 60 మంది వాహనదారులను గుర్తించి జరిమానా విధించారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని... సీపీ ప్రమోద్‌కుమార్‌ స్పష్టం చేశారు.

మాస్క్ లేకుంటే జరిమానా కట్టాల్సిందే..

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో మాస్కు ధరించకుండా బయట తిరిగే వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలంటూ... విస్తృత ప్రచారం కల్పించారు. మండల పరిధిలో రెండు రోజుల్లో 16 మందికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా కట్టాలని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ శర్మన్‌ చౌహన్‌ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది మాస్కులు తప్పనిసరి ధరించాలని ఆదేశించారు.

మాస్క్ లేకుంటే నో ఎంట్రీ

రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని మాల్స్‌, దుకాణాల యాజమాన్యాలకు పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు లేకుంటే ఎవరినీ లోపలికి అనుమతించవద్దని పేర్కొన్నారు. అనుమతిస్తే జరిమానాలు చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతోపాటు హోర్డింగ్‌లు ఏర్పాటుచేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఇవీచూడండి: 'ప్రతి కొవిడ్​ కేసుకు 25-30 మందిని గుర్తించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.