ETV Bharat / city

పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి - minister singireddy niranjanreddy latest

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్​లో మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేయగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు.

Telangana Farmers Association appeals minister singireddy niranjanreddy to pay compensation to formers
పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి
author img

By

Published : Nov 2, 2020, 8:07 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు 13 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని.. రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రికి వినతిపత్రం సమర్పించింది. వరి, పత్తి, సోయాచిక్కుడు, కంది, ఇతర పంటలు బాగా దెబ్బతిన్నాయని.. ఒక్కో ఎకరానికి వేల రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40 మంది రైతులు వరదల వల్ల చనిపోయారని.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, పంట పొలాల్లో నీరు నిలిచే ఉందని వివరించారు.

పంట రుణాలు రద్దు చేయాలి:

నష్టపోయిన పంటల గణాంకాలు సేకరించి ఎకరాకు 25 వేల రూపాయలు పరిహారం చెల్లించడంతో పాటు నష్టపోయిన రైతుల వానాకాలం పంట రుణాలు రద్దు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైతుబీమా లేని.. చనిపోయిన రైతులకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని సూచించారు. తడిసిన పంట ఉత్పత్తులన్నింటినీ పంజాబ్‌ తరహాలో కనీస మద్దతు ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఇన్ని విధాలుగా నష్టపోయిన రైతులకు యాసంగిలో వ్యవసాయం చేయడం కష్టతరమౌతుందన్నారు.

ప్రభుత్వం సహాయం చేయకుండా కోలుకునే పరిస్థితి లేనందున నాణ్యమైన విత్తనాలు ఎరువులు, సరఫరా చేయాలన్న వినతిపై.. మంత్రి నిరంజన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పెసరగాయల జంగారెడ్డి, తీగల సాగర్, సహాయ కార్యదర్శి శోభన్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.