ETV Bharat / city

రెండు కిలోవాట్లు దాటితే ఈఎల్‌సీబీ

వేసవి వస్తూనే అగ్నిప్రమాదాలతో హడలెత్తిస్తుంటుంది. కొన్నిసార్లు ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉంటోంది. చాలావరకు అగ్నిప్రమాదాలకు షార్ట్‌ సర్క్యూటే కారణమని చెబుతున్నారు. దుకాణాలు, గోడౌన్లతోపాటూ ఇటీవల అపార్ట్‌మెంట్లలోనూ ప్రమాదాలు పెరిగాయి. ఈ ప్రమాదాలకు గల కారణాలు, అవి సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ తనిఖీ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు.

Telangana Electricity Inspection Officer Srinivas Rao about fire accidents
రెండు కిలోవాట్లు దాటితే ఈఎల్‌సీబీ
author img

By

Published : Mar 15, 2021, 8:42 AM IST

వేసవి వచ్చిందంటే చాలు.. అగ్ని ప్రమాదాలు హడలెత్తిస్తాయి. పెరిగిన లోడ్‌కు తగ్గట్టుగా వైరింగ్‌ను మార్చుకోకపోవడం, విద్యుత్తు ఉపకరణాల వినియోగం పెరగడం, నాసిరకం వస్తువుల వాడకం, దీపాలు వెలిగించి బయటకు వెళ్లడం తదితరాలు అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వ విద్యుత్తు తనిఖీ అధికారి ఎస్‌.శ్రీనివాస్‌రావు అన్నారు. 50 కిలోవాట్ల సామర్థ్యం కంటే ఎక్కువలోడు ఉన్న హెచ్‌టీ కనెక్షన్లను మాత్రమే తమ శాఖ ఏడాదికోసారి తనిఖీ చేస్తుందని.. వీటిలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి సంవత్సరంలో రెండు మూడు తప్ప పెద్దగా ప్రమాదాలు జరగలేదన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కంటే ఇతర కారణాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇళ్లు, దుకాణాలు, గౌడౌన్ల యజమానులు ఎప్పటికప్పుడు పరీక్షించుకుని స్వీయ ధ్రువీకరణ పొందడం ఒక్కటే షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదాలను నివారించేందుకు మార్గమని ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ముఖాముఖిలో వెల్లడించారు.

  • నిత్యం ఎక్కడో ఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాథమిక పరిశీలనలో షార్ట్‌సర్క్యూటే కారణమని చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది?

అగ్నిప్రమాదాలు ఎక్కువగా మూసి ఉన్న దుకాణాలు, గౌడౌన్లలో జరుగుతున్నాయి. ఇదివరకు మూసేసే సమయంలో విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపేసేవారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్తును ఆపడం లేదు. వదులు తీగలతో ఎక్కడైనా స్పార్క్‌ ఏర్పడితే మంటలు త్వరగా వ్యాపించే గుణమున్న వస్తువులతో మొత్తం తగలబడుతున్నాయి. అన్ని ప్రమాదాలకు షార్ట్‌సర్య్కూటే కారణం కాదు.

  • ప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఏ) ప్రకారం విద్యుత్తు కనెక్షన్‌ 2 కిలోవాట్‌ దాటితే ఎర్త్‌ లీకేజీ సర్క్యూట్‌ బ్రేకర్‌(ఈఎల్‌సీబీ) తప్పనిసరి. కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో ఒక కిలోవాట్‌ నుంచి దీన్ని తప్పనిసరి చేయాలని ముసాయిదాలో పొందుపర్చింది. ప్రమాదాల నివారణకు ఇది చాలా ముఖ్యం. ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే ట్రిప్‌ అయ్యి వస్తువులు కాలిపోయేదాక రాకుండా అడ్డుకుంటుంది. ఎర్తింగ్‌ సరిగా లేకపోతే ప్రమాదాలే కాదు విద్యుత్తు బిల్లు ఎక్కువగా వస్తుంది.

  • విద్యుత్తు ఉపకరణాల వాడకం పెరగడం కూడా ప్రమాదాలకు కారణమా?

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఏసీలు, గీజర్లు, మైక్రోఓవెన్‌, ఇస్త్రీపెట్టె, నీటి మోటార్లు సర్వసాధారణం అయ్యాయి. కానీ ఇంట్లో తీగల సామర్థ్యం మాత్రం చాలాచోట్ల పెంచుకోలేదు. పాత అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో ఎక్కువగా ప్రమాదాలకు ఇదే కారణం. ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం ఒక కిలోవాట్‌కు తగ్గట్టుగా అప్పట్లో వైరింగ్‌ ఉండేది. ఇవే తీగలపైన ఐదుకిలోవాట్లపైన లోడు వాడకంతో కాలిపోతున్నాయి. లోడుకు తగ్గ వైరింగ్‌.. దానికి తగ్గ ఈఎల్‌సీబీ ఏర్పాటు చేసుకోవాలి. కొన్నిసార్లు ఉపకరణాలు ఫెయిలై కూడా అగ్నిప్రమాదాలకు దారితీస్తుంది. ఇది షార్ట్‌ సర్య్యూట్‌తో కాదని గుర్తించాలి. నాణ్యమైన, ఐఎస్‌ఐ మార్కు కల్గిన ఉపకరణాలనే వాడాలి.

  • గత ఏడాది లాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రమాదాల నివారణకు మీ శాఖ తరఫున తీసుకుంటున్న చర్యలు?

మా శాఖ హెచ్‌టీ కనెక్షన్‌ 50కిలోవాట్ల సామర్థ్యంపైన ఉన్న పరిశ్రమలు, పెద్ద భవనాలను, 15 మీటర్లు దాటిన భవనాలను తనిఖీ చేసి అంత సక్రమంగానే ఉంటే కనెక్షన్‌ ఇచ్చేందుకు అనుమతి ఇస్తాం. ఆ తర్వాత కూడా ఏడాది ఒకసారి తనిఖీలు చేపడుతుంటాం. వేసవిలో మే 1 నుంచి విద్యుత్తు భద్రతా వారోత్సవాల్లో అవగాహన పెంపొందిస్తున్నాం. మా పరిధిలోకి వచ్చే వాటిలో ప్రమాదాలు పెద్దగా జరగడం లేదు. గత ఏడాది ఎగ్జిబిషన్‌లో ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదు. అలాంటి ఆధారాలేవి అక్కడ దొరకలేదు. అప్పా జంక్షన్‌ వద్ద గేటెడ్‌ కమ్యూనిటీలో పిల్లలు ఆడుకునే ప్రదేశంలో తాత్కాలిక వైరింగ్‌తో విద్యుదాఘాతంతో ప్రాణం తీసింది. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న భవనాలన్నీ తక్కువ లోడ్‌ ఉన్నవే. వీటిని ఆయా యాజమానులే లైసెన్స్‌ కల్గిన విద్యుత్తు కాంట్రాక్టర్లు, ఎలక్ట్రిషియన్స్‌తో తనిఖీలు చేయించుకోవాలి. ఎలక్ట్రికల్‌ ఆడిటర్స్‌ ఉంటారు. వారితోనూ పరీక్షించుకోవచ్ఛు ప్రభుత్వాలు సైతం స్వీయ ధ్రువీకరణకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. భవన యాజమానులు ప్రమాదాలు జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.