ETV Bharat / city

సగం మంది సిబ్బంది.. హాజరైతే చాలు! - ఆన్​లైన్​ తరగతులు

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది సగంమంది విధులకు హాజరైతే చాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్​ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్​లైన్​ తరగతులు వినే విద్యార్థులను పర్యవేక్షించేదుకు ఉపాధ్యాయులంతా విధులకు హాజరు కావాలని ఆగస్టు 25న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ ఆదేశాల మేరకు.. విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

telangana Education Department Release new Orders For Teachers
సగం మంది టీచర్లు.. బడికొస్తే చాలు!
author img

By

Published : Sep 12, 2020, 8:29 AM IST

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 21వ తేదీ నుంచి సగం మంది విధులకు హాజరైతే చాలు. ఈ మేరకు గత నెల 25వ తేదీన విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 1వ తేదీ నుంచి డిజిటల్‌ పాఠాలను ప్రారంభించిన నేపథ్యంలో ఆగస్టు 27వ తేదీ నుంచి బోధనా, బోధనేతర సిబ్బంది అందరూ విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులను ఫోన్ల ద్వారా పర్యవేక్షించాలని, పాఠాల ప్రణాళికను రూపొందించుకోవాలని తదితర మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కేంద్రం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఈ నెల 21 నుంచి నుంచి 50 శాతం మంది సిబ్బందిని విద్యాసంస్థలకు రప్పించుకోవచ్చని పేర్కొంది. దాని ఆధారంగా ఈ నెల 21వ తేదీ నుంచి సగం మందే బడులకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో విద్యాశాఖ అంతకుముందు 100 శాతం వెళ్లాలని ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి గత కొద్ది రోజులుగా విన్నవిస్తున్నాయి. ఈ క్రమంలో సవరణ ఉత్తర్వులిచ్చారు. ఇదిలా ఉండగా. ఉపాధ్యాయులు 20వ తేదీ వరకు ఇంటి నుంచే విద్యార్థుల అభ్యసనలను పర్యవేక్షించాలని విద్యాశాఖ శుక్రవారం రాత్రి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉపాధ్యాయులు శనివారం (12వ తేదీ) నుంచి 20 వరకు పాఠశాలకు వెళ్లకుండా ఇంటి నుంచే విద్యార్థుల అభ్యసన తీరును పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఇవీ ఆదేశాల్లోని అంశాలు

  • ఈ నెల 21వ తేదీ నుంచి గరిష్ఠంగా 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరుకావాలి. వారు ఆన్‌లైన్‌ బోధన, టెలీ కౌన్సెలింగును పర్యవేక్షించాలి.
  • ఉపాధ్యాయులు తాము పనిచేసే పాఠశాలలూ/కళాశాలలూ కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట ఉంటేనే హాజరుకావాలి.
  • ఆన్‌లైన్‌/దూర విద్యను కొనసాగించాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి.

ఇదీ చదవండి: రోడ్లపై ఎస్సార్​ఎస్పీ కాలువ.. ఆందోళనలో రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.