ETV Bharat / city

2021 చివరికల్లా 13 లక్షల సీసీ కెమెరాలు: డీజీపీ - సైబర్ నేరాలపై డీజీపీ మహేందర్ రెడ్డి

రాబోయే రోజుల్లో సమాజం ఎదుర్కొనే అతి పెద్ద సవాలు సైబర్‌ నేరాలేనని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. చోరీల వంటి సాధారణ  నేరాలు కూడా క్రమంగా సైబర్‌ ముసుగు తొడుక్కుంటున్నాయన్నారు. శాంతిభద్రతలకు సంబంధించి 2021లో ఎదుర్కోబోయే సవాళ్ళు, తీసుకోబోయే చర్యల గురించి ఆయన ఈటీవీభారత్​తో మాట్లాడారు.

telangana dgp mahender reddy about cyber security
సైబర్ నేరాలపై డీజీపీ మహేందర్ రెడ్డి
author img

By

Published : Jan 1, 2021, 7:19 AM IST

కాలు కదపకుండా ఖాతాలు కొల్లగొట్టే అవకాశం ఉండటం వల్లనే సైబర్‌ నేరాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణమన్నారు. చాలామంది ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత వివరాలు పెడుతున్నారని, వీటి ఆధారంగా కూడా నేరాలు జరుగుతున్నాయని వివరించారు. మొత్తమ్మీద రెండు రకాలుగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఉదాహరణకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు చోరీ చేసి, డబ్బు ఖాళీ చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమాచారం ఆధారంగా వేధింపులకు పాల్పడతారు. ఇవన్నీ ఒక కోవలోకి వచ్చే సైబర్‌ క్రైమ్‌ కాగా చోరీల వంటివి కూడా చివరకు పాక్షికంగా సైబర్‌ నేరాలుగా మారడం రెండో పద్ధతి. ఉదాహరణకు గతంలో ఒక ప్రాంతంలో వాహనం దొంగతనం చేసిన వ్యక్తి మరో ప్రాంతానికి తీసుకెళ్ళి అమ్ముకునేవాడు. కాని ఇప్పుడు దాన్ని ఓఎల్‌ఎక్స్‌ వంటి వెబ్‌సైట్లో పెట్టి అనేక మందిని మోసం చేస్తున్నాడు’’ అని మహేందర్‌రెడ్డి వివరించారు. రాబోయే రోజుల్లో వీటి మధ్య అంతరం చెరిగిపోనుందన్నారు. దీనికి తగ్గట్టుగానే పోలీసు దర్యాప్తు పద్ధతులు కూడా మారాల్సి ఉందన్నారు. అంటే ముందు వాహనం చోరీ చేసిన వ్యక్తిని పట్టుకోవడంతోపాటు దాన్ని ఆన్‌లైన్లో అమ్ముకున్నట్లు గుర్తించి, నిరూపించే ఆధారాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటివాటిపై ఇప్పటికే అప్రమత్తమయ్యామన్నారు.

2021 చివరికల్లా 13 లక్షల సీసీ కెమెరాలు

వాస్తవానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో తెలంగాణ పోలీసుశాఖ దేశంలోనే ముందుందని డీజీపీ తెలిపారు. ‘టీఎస్‌ కాప్‌’ ఇందుకు ఉదాహరణ అన్నారు. అలానే సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంలోనూ మనదే అగ్రస్థానమని, 2021 చివరికల్లా రాష్ట్రంలో 13 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనివల్ల సాధారణ నేరాలు నివారించడమే కాకుండా దర్యాప్తు కూడా సులభం అవుతుందన్నారు. సైబర్‌ సవాలును ఎదుర్కొనేందుకు సిబ్బందినీ సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.

ప్రతి పోలీస్‌స్టేషన్లో కనీసం ఇద్దరు సిబ్బందిని సైబర్‌ నేరాల దర్యాప్తులో సుశిక్షితులను చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల్లో సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరెటరీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సైబర్‌ నేరాల దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను పెడుతున్నామని వివరించారు. ఒకరే అనేక పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాలు చేయడానికి అవకాశం ఉంటుందని, అటువంటప్పుడు అన్ని పోలీస్‌స్టేషన్ల నుంచి దర్యాప్తు సాగించడం కంటే ఒక బృందం దీన్ని దర్యాప్తు చేయడం ఉత్తమమని ఆయన వివరించారు. సైబర్‌ నేరాలకు సరిహద్దులతో సంబంధం ఉండదు కాబట్టి అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమన్నారు. అందుకే ఆయా రాష్ట్రాలను సంప్రదించి అవసరమైన చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.