ETV Bharat / city

Telangana Home Minister Mahmood Ali : 'ఏడేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి మతఘర్షణలు లేవు'

తెలంగాణలో ఏడేళ్లుగా ఎలాంటి మతఘర్షణలు లేకుండా పోలీసు శాఖ రాత్రింబవళ్లు శ్రమిస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ(Telangana Home Minister Mahmood Ali) పునరుద్ఘాటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Martyrs Remembrance Day in Telangana) సందర్భంగా హైదరాబాద్​ గోషామహల్​ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు.

Telangana Home Minister Mahmood Ali
Telangana Home Minister Mahmood Ali
author img

By

Published : Oct 21, 2021, 10:15 AM IST

Updated : Oct 21, 2021, 11:03 AM IST

పోలీసు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ(Telangana Home Minister Mahmood Ali) పునరుద్ఘాటించారు. పోలీసు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో 62 మంది పోలీసులు మరణించారని తెలిపారు. ఏడేళ్లలో ఎలాంటి మతఘర్షణలు లేకుండా చేశామని చెప్పారు. బోనాలు, రంజాన్​ పండుగలను ప్రశాంతంగా నిర్వహించామని వెల్లడించారు. పోలీసు అమరవీరులకు ప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటించారు.

హైదరాబాద్​ గోషామహల్​ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Martyrs Remembrance Day in Telangana) కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రితో పాటు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి(Telangana DGP Mahender Reddy), హైదరాబాద్ సీపీ అంజనీకుమార్(Hyderabad CP Anjani Kumar) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్​ తమిళిసై కూడా ఈ కార్యక్రమానికి హాజరై.. అమరవీరుల స్థూపానికి గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు.

ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి(Telangana DGP Mahender Reddy) అన్నారు. పోలీసు శాఖకు సర్కార్.. సీసీ కెమెరాలు, సాంకేతికత అందించిందని చెప్పారు. ఉత్తమ సేవలందించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందిస్తోందని పేర్కొన్నారు. అత్యవసర స్పందన కోసం 11,500 వాహనాలు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8.25 లక్షల సీసీకెమెరాలున్నాయని వెల్లడించారు. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల సీసీ కెమెరాలు ఉన్నట్లు వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న మహేందర్ రెడ్డి(Telangana DGP Mahender Reddy).. కరోనా సమయంలో పోలీసుల సేవలు మరవలేవని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామన్న డీజీపీ(Telangana DGP Mahender Reddy).. అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

"రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టాం. పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చాం. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో కమాండ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పోలీసులపై నమ్మకం పెరిగేలా సమర్థంగా పనిచేయాలి. కొవిడ్ సమయంలో పోలీసుల సేవలు అందించారు. కరోనా సమయంలో సేవలందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అమరులైన ప్రతి పోలీసు కుటుంబానికి అండగా ఉంటాం."

- మహేందర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ

Last Updated : Oct 21, 2021, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.