త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌తో కలిసి పాల్గొన్నారు.
కేటీఆర్‌కు పద్మారావు శుభాకాంక్షలు తెలపడం.. ఆయణ్ను ముఖ్యమంత్రి చేస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. గత రెండు రోజులుగా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. రైల్వే కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా కాపాడాలని పద్మారావు కోరారు.