ETV Bharat / city

గోల్కొండ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సీఎస్ - telangana chief secretary somesh kumar

హైదరాబాద్​ గోల్కొండ ఏరియా ఆస్పత్రిని సీఎస్ సోమేశ్ కుమార్ సందర్శించారు. త్వరలో అందుబాటులోకి రానున్న 100 ఆక్సిజన్ పడకలకు సంబంధించిన పురోగతిని పరిశీలించారు.

తెలంగాణ సీఎస్, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, సీఎస్ సోమేశ్
author img

By

Published : May 8, 2021, 6:08 PM IST

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్​ఎంసీ పరిధిలోని ప్రభుత్వాస్పత్రులను సీఎస్ సోమేశ్ కుమార్ సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా గోల్కొండ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సీఎస్.. కొవిడ్ వార్డులను పరిశీలించారు.

రాష్ట్రవ్యాప్తంగా రెండో డోస్ వ్యాక్సినేషన్​కి సంబంధించి ప్రత్యేక డ్రైవ్ జరుగుతున్న నేపథ్యంలో.. కొవిడ్ టీకా వేసుకున్న వారితో ముచ్చటించారు. గోల్కొండ ఆస్పత్రిలో త్వరలో అందుబాటులోకి రానున్న 100 ఆక్సిజన్ పడకలకు సంబంధించిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎస్​ వెంట హెల్త్ సెక్రటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి సహా పలువురు అధికారులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.