ETV Bharat / city

700 దాటిన కరోనా మరణాలు... 16 రోజుల్లో 173 మంది మృతి

author img

By

Published : Aug 18, 2020, 6:54 AM IST

రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 703 మంది కొవిడ్‌తో మృతిచెందారు. మార్చి నుంచి జూన్‌ వరకూ 4 నెలల్లో 260 మంది చనిపోగా.. ఒక్క జులైలోనే 270 మంది మృత్యువాతపడ్డారు. ఈ నెలలోనూ అదే ఒరవడి కొనసాగుతోందని మరణాల సంఖ్యను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తంగా 92,255 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరణాలు 0.76 శాతంగా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ విషయంలో జాతీయ సగటు 1.93 శాతమని తెలిపింది.

corona
corona

రాష్ట్రంలో కొత్తగా 894 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి మరో 10 మంది మృతిచెందారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకూ నమోదైన గణాంకాలను వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 703 మంది కొవిడ్‌తో మృతిచెందగా.. గత 16 రోజుల్లోనే 173 మంది మరణించారు. మార్చి నుంచి జూన్‌ వరకూ 4 నెలల్లో 260 మంది చనిపోగా.. ఒక్క జులైలోనే 270 మంది మృత్యువాతపడ్డారు. ఈ నెలలోనూ అదే ఒరవడి కొనసాగుతోందని మరణాల సంఖ్యను పరిశీలిస్తే అర్థమవుతోంది. పాజిటివ్‌లు కూడా సగటున రోజుకు 1800 చొప్పున నమోదవుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 92,255 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరణాలు 0.76 శాతంగా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ విషయంలో జాతీయ సగటు 1.93 శాతమని తెలిపింది. మొత్తం మరణాల్లో కేవలం కరోనా కారణంగా మరణించినవారు 46.13 శాతం కాగా, దీర్ఘకాలిక జబ్బులు ఉండి కొవిడ్‌ సోకి మృతిచెందినవారు 53.87 శాతం ఉన్నట్లు వివరించింది.

స్వల్ప పెరుగుదల

ఆదివారం(16వ తేదీ) 8,794 నమూనాలను పరీక్షించారు. గత 10 రోజుల్లో ఇవే అతి తక్కువ రోజువారీ పరీక్షలు. అయితే, ఈ నెల 7 నుంచి 16 వరకూ పరీక్షలు, పాజిటివ్‌ల నమోదు సరళిని పరిశీలిస్తే.. రోజూ 8-9 శాతం మధ్యలో పాజిటివ్‌లు నమోదవుతుండగా.. ఆదివారాల్లో మాత్రం సుమారు 10 శాతంగా ఉండటం గమనార్హం. సాధారణ రోజుల్లో పెద్దగా లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయించుకునేవారు ఎక్కువగా ఉంటారనీ, అదే సెలవు రోజుల్లో లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే నమూనాలివ్వడానికి వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆయా రోజుల్లో పాజిటివ్‌లలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోందని భావిస్తున్నాయి. మొత్తంగా ఆదివారం నాటికి రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 7,53,349కి పెరిగింది.

కోలుకున్నవారు 70 వేలు దాటారు

రాష్ట్రంలో ఆదివారం మరో 2,006 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 70,132కి చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్నవారి శాతం 76.01 శాతంగా నమోదు కాగా.. జాతీయ స్థాయిలో సగటు 71.91 శాతంగా ఉన్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాతో రాష్ట్రంలో 21,420 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 14,404 మంది ఐసొలేషన్‌ కేంద్రాల్లో, ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌)లో 147 కేసులు నమోదవగా.. 20కి పైగా పాజిటివ్‌లు నమోదైన జిల్లాల జాబితాలో జగిత్యాల(31), జోగులాంబ గద్వాల(21), కరీంనగర్‌(69), ఖమ్మం(44), మహబూబ్‌నగర్‌(30), మహబూబాబాద్‌(31), మేడ్చల్‌ మల్కాజిగిరి(51), నల్గొండ(37), నిజామాబాద్‌(38), పెద్దపల్లి(62), రంగారెడ్డి(85), సంగారెడ్డి(29), సిద్దిపేట(58), వరంగల్‌ నగర(44) జిల్లాలున్నాయి. ప్రభుత్వ వైద్యంలో ప్రస్తుతం 5,270 పడకలు కొవిడ్‌ సేవలకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటులో 3,577 పడకలు ఖాళీగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.