ETV Bharat / city

ఇళ్లు కట్టుకునే పేదలకు టీఎస్​బీపాస్ బ్రహ్మాస్త్రం: కేటీఆర్​ - టీఎస్​ బీపాస్ బిల్లు

టీఎస్​బీపాస్​ ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులు వస్తాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో ఇంటి అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని.. ఈ చట్టం వస్తే ఆ ఇబ్బందులు ఉండవన్నారు. ఇలాంటి చట్టం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు.

ktr
ktr
author img

By

Published : Sep 15, 2020, 5:30 PM IST

ఇళ్లు కట్టుకునే పేదలకు టీఎస్​బీపాస్ బ్రహ్మాస్త్రం అని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్​ అభివర్ణించారు. ఇలాంటి చట్టం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. గతంలో ఇంటి అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని.. ఈ చట్టం వస్తే ఆ ఇబ్బందులు ఉండవని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో కడితే నోటీసు లేకుండా కూల్చివేసేలా బిల్లులో నిబంధన పెట్టామన్నారు. టీఎస్​బీపాస్​పై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

దరఖాస్తు చేసుకున్న 21 రోజల్లో అనుమతులు ఇస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మొత్తం 12 శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఏమైనా లోపాలుంటే 10 రోజులలోపు తెలపాలన్న నిబంధన ఉందని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాల విస్తీర్ణం, ఏడు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే నివాసాలకు ఎలాంటి అనుమతి అవసరంలేదన్నారు. అలాగని ఇష్టం వచ్చినట్లు తాజ్​మహాల్​, కుతుబ్​మినార్​ కడుతామంటే చట్టం ఒప్పుకోదని... అలా కడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి ఇళ్లు నిర్ణించుకోవాలని పేర్కొన్నారు. అన్ని వివరాలతో నిబంధనలు రూపొందిస్తాన్నారు. చర్చ అనంతరం టీఎస్​బీపాస్​కు మండలి ఆమోదం తెలిపింది.

ఇళ్లు కట్టుకునే పేదలకు టీఎస్​బీపాస్ బ్రహ్మాస్త్రం: కేటీఆర్​

ఇదీ చదవండి: విద్యుత్​ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.